మనవడి బర్త్ డే కి అందరూ రండి - చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మనవడు నారా దేవాన్ష్ బర్త్ డేను పురస్కరించుకుని విజయవాడలో ఉగాది పర్వదినాన భారీ విందును ఇవ్వనున్నారు.దాదాపు 1,500 మంది హాజరుకానున్న ఈ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Please Come To My Grandson Birthday-cbn-TeluguStop.com

నిన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు.ఈ విందుకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పార్టీ నేతలకు ఆహ్వానం పలికారు.

ఇక మీరు కూడా హాజరుకావాల్సిందేనని ఆయన అధికార యంత్రాంగానికి కూడా ఆహ్వానం పలికారు.గత నెల 22న దేవాన్ష్ బర్త్ డేను హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

నాడు తేదీల ప్రకారం దేవాన్ష్ బర్త్ డే వేడుక జరపగా, తాజాగా ఈ నెల 8న ఉగాది పర్వదినాన విజయవాడలో తిథుల ప్రకారం మరోమారు దేవాన్ష్ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube