'ప్రదీప్' పెళ్లిచూపులు రద్దు చేయాలంటూ...  

Please Cancel Pellichupulu Programe Rayalaseema Mahila Sang Demand-

‘పెళ్లి చూపులు’ పేరుతో మహిళలను కించపరిచే విధంగా … యాంకర్‌ ప్రదీప్‌ నటిస్తున్నాడని, ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, అలాగే… యాంకర్‌ సుమపై, టీవీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ షో ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ …రాయలసీమ మహిళా సంఘ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూల్ కలెక్టరేట్‌ వద్ద మహిళలు ధర్నా చేశారు.

Please Cancel Pellichupulu Programe Rayalaseema Mahila Sang Demand--Please Cancel Pellichupulu Programe Rayalaseema Mahila Sang Demand-

ఆడవాళ్లను అంగడి సరుకును చేసి అవమానిస్తున్న యాంకర్‌ ప్రదీప్‌, ప్రోగ్రాం నిర్వహిస్తున్న సుమ, ప్రసారం చేస్తున్న టీవీ యాజమాన్యం మహిళల మనోభావాలను దెబ్బతీసున్నారని సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అన్నారు.తెలుగు ప్రజల సంప్రదాయాలను, ఆచారాలకు భంగం కలిగించే విధంగా ఈ టీవీ షో నిర్వహిస్తున్నారన్నారు.ధర్నా అనంతరం జేసీ పి.రవి సుభాష్‌కు వినతిపత్రం సమర్పించారు.