కోల్ కతా టీంకు ప్లేఆఫ్ ఆశలు సజీవం

ఐపీఎల్ లో భాగంగా మంగళవారం నాడిక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన టీ-20 మ్యాచ్ లో కోల్క నైట్ రైడర్స్(కేకేఆర్) 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో టోర్నీలో ప్లేఆఫ్స్  ఆశలు సజీవంగా ఉంచుకుంది.

 Playoff Hopes Are Alive For The Kolkata Team, Kolkata , Ipl , Ipl 2021,playoff H-TeluguStop.com

సీజన్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డిల్లీ క్యాపిటల్స్ కు కేకేఆర్ షాకిచ్చింది.ఢిల్లీ విధించిన 128 పరగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. మొదటి ఓపెనర్ గిల్ 18 పరుగులతో రాణించగా నితీశ్ రానా 36 తనదైన బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు.

  సునీల్ నరేన్ చివర్లో 10 బంతుల్లో 22 పరుగులతో మెరిశాడు.ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, అశ్విన్, లలిత్ యాదవ్, రబడ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈ సీజన్ లో బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మెన్ ఈ మ్యాచ్ లో తేలిపోయారు.

టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కి సుభారంభంగా దక్కిన తర్వాత తడబడింది.

ఓపెనర్లు స్మిత్, ధావన్ మొదటి వికెట్ కు 35 పరుగులు జోడించారు.అనంతరం దూకుడు మీదున్న గబ్బర్ ను ఫెర్గుసన్ పెవిలియన్ చేర్చాడు.

తర్వాత వచ్చిన శ్రేయస్ (1) విఫలమయ్యాడు.తర్వాత పంత్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు స్మిత్.

వీరిద్దరూ మూడో వికెట్ కు  37 పరుగులు జోడించగొ స్మిత్ (39) ఔటయ్యాడు.కాసేపటికే హిట్ మెయర్ (4) లలిత్ యాదవ్ (0), అక్షర పటేల్ (0), అశ్విన్ (9), పెవిలియన్ కు క్యూ కట్టారు.

ఓ వైపు వరుస వికెట్లు కోల్పోతునతనా పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.చివరి ఓవర్లో రెండు పరుగులకు ప్రయత్నించిన పంత్ (39) రనౌట్ గా వెనుదిరిగాడు.

దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.కోల్ కతా బౌలర్లలో నరైన్, ఫెర్గూసన్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు పడగొట్టగా   సౌదీ 1 వికెట్ పడగొట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube