పేకాట ఆడాడు.. ప్రాణం పోయింది.. కారణం ఏంటంటే?

యువత దేశానికి ఆదర్శం అంటారు.అలాంటి యువత ఏం చేస్తున్నారు? వారు సరైన మార్గంలో నడుచుకుని ఉన్నత శిఖరానికి చేరుకుంటే, వారి తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది.ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వారవుతారు.యువత అంటే ఇలాగే ఉండాలి.కానీ కొందరు మాత్రం వారి భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా చెడు సావాసాలు చేస్తూ, చెడు వ్యసనాలకు అలవాటు పడి పూర్తిగా వారు మానసిక స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి బంగారం లాంటి భవిష్యత్తును ఉరి కంబానికి వేలాడదీస్తున్నారు.

 Young Man Committed Suicide, Playing Cards, Youth , Bad Habits,jagityal-TeluguStop.com

జగిత్యాల జిల్లాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుని ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.పూర్తి వివరాల్లోకి వెళితే.

జగిత్యాల జిల్లాలో మల్యాల మండలం లో కొందరు యువకులు కలిసి పేకాట ఆడుతుండగా, గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు ఆ స్థలానికి చేరుకొని ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
సంఘటన స్థలంలో పోలీసులు పది వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ కేసు నమోదు కావడంతో ముగ్గురిలో ఒకరైన కిరణ్ అనే యువకుడు ఎంతో మనస్థాపానికి గురై తన సొంత పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులే కారణమని, మీరు తప్పుడు కేసు నమోదు చేయడం వల్ల ఎంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని కిరణ్ తల్లిదండ్రులు ఆరోపించారు.
ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటుపడి ఎంతోమంది వారి బంగారు భవిష్యత్తును స్వయంగా వారే నాశనం చేసుకుంటున్నారు.రోజురోజుకు ఇలాంటి మరణాల సంఖ్య పెరుగుతుండడంతో కన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నారు.

దేశానికి ఎంతో ఆదర్శం కావాల్సిన యువత ఇలా చెడు అలవాట్ల వల్ల మధ్యలోనే తనువు చాలించడం ఎంతో భాదాకరమని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube