భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో( ODI World Cup ) లీగ్ దశ నుండి సెమీఫైనల్ వరకు ఓటమిని చవిచూడకుండా ఫైనల్ చేరిన భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసింది.దీంతో ICC ప్రపంచ కప్ 2023 విశ్వ విజేతగా ఆస్ట్రేలియా( Australia ) నిలిచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు విరాట్ కోహ్లీ, కేఎల్.రాహుల్ అర్థ సెంచరీలతో రాణించడం వల్ల భారత జట్టు 240 పరుగులు నమోదు చేసింది.
భారత బౌలర్లు పూర్తిస్థాయిలో ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేసి భారత్ కు విజయాన్ని అందిస్తారని అంతా భావించారు.కానీ ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్ ట్రావిస్ హెడ్( Travis Head ) 137 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టును విశ్వ విజేతగా నిలబెట్టాడు.
ఈ ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్( Man Of The Match ) అవార్డును హెడ్ దక్కించుకున్నాడు.
ఈ ప్రపంచ కప్ లో అత్యధికంగా 765 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ( Virat Kohli ) ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు.
ఈ టోర్నమెంట్ లో 11 ఇన్నింగ్స్ లలో 9 ఫిఫ్టీ ప్లస్ స్కోర్ లను నమోదు చేశాడు.ఈ ప్రపంచకప్ లో స్కోరింగ్ చార్ట్ లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.
బౌలింగ్ చార్ట్ లలో మహమ్మద్ షమీ( Mohammed Shami ) అగ్రస్థానంలో నిలిచాడు.మహమ్మద్ షమీ కేవలం 7 ఇన్నింగ్స్ లలో 24 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ టోర్నమెంట్ లో అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు.ఫైనల్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.గ్లెన్ మ్యాక్స్ వెల్( Glenn Maxwell ) ఆఫ్ఘనిస్తాన్ పై 201 నాటౌట్ తో ఒక మ్యాచ్ లో వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ టోర్నీలో క్వింటన్ డి కాక్( Quinton deCock ) 4సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.విరాట్ కోహ్లీ ఆరు అర్థ సెంచరీలతో అత్యధిక అర్ద సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మహమ్మద్ షమీ ఏడు ఇన్నింగ్స్ లలో 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.మహమ్మద్ షమీ న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో 57 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసి ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ప్లేయర్ గా నిలిచాడు.రోహిత్ శర్మ 31 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.డారిల్ మిచెల్ 11 క్యాచ్లు పట్టి అత్యధిక కేసులు పట్టిన ఆటగాడుగా నిలిచాడు.క్వింటన్ డి కాక్ 20 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్ గా నిలిచాడు.గ్లెన్ మ్యాక్స్ వెల్ 150.37 స్ట్రైకర్ రేట్ తో అత్యధిక స్ట్రైకర్ రేట్ ప్లేయర్ గా నిలిచాడు.