ఆహాలో రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్‌ చిన్న సినిమా

ఇండియాలో మొదటి క్రాస్ టైమ్‌ కనెక్షన్‌ కాన్సెప్ట్‌ తో వచ్చిన సినిమా అంటూ ప్రచారం చేసిన ప్లే బ్యాక్ సినిమా మార్చి 5వ తారీకున విడుదల చేసిన విషయం తెల్సిందే.సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

 Play Back Movie Streaming Very Soon In Telugu Aha Ott-TeluguStop.com

కాని కమర్షియల్‌ గా సినిమా నిరాశ పర్చింది.ఈ విభిన్న సినిమాను ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆహా లో ఈ సినిమా ను ఈనెల 21 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.క్రాస్‌ కనెక్షన్‌ అనే కాన్సెప్ట్‌ చాలా విభిన్నంగా ఉండి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

 Play Back Movie Streaming Very Soon In Telugu Aha Ott-ఆహాలో రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్‌ చిన్న సినిమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా కరోనా కారణంగా థియేటర్లలో విడుదల అయ్యి నిరాశ పర్చింది.కాని ఖచ్చితంగా ఆహా లో సక్సెస్‌ అవుతుందని అంటున్నారు.

ఆహా లో సినిమా ల విషయం లో ఒక టీమ్‌ గ్రేడింగ్‌ చేసి మరీ ఎంపిక చేస్తారు.బన్నీ వాసు నుండి మొదలుకుని అల్లు అరవింద్ వరకు చాలా మంది ఆహా సినిమా ల ఎంపిక విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు.

కనుక ఈ సినిమా ను అల్లు అరవింద్‌ చూసి నచ్చి మెచ్చి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.అతి త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ ను ఆన్‌ లైన్‌ లో మొదలు పెడతారని తెలుస్తోంది.

ఆహా లో ఇటీవల విడుదల అయిన థ్యాంక్యూ బ్రదర్‌ సినిమా నిరాశ పర్చింది.దాంతో ఆహా ఖాతాదారులు ఈ సినిమా పై అంచనాలు పెంచుకుని వెయిట్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఆహా లో పలు చిన్న సినిమా లు వచ్చి మంచి విజయన్ని సొంతం చేసుకున్నాయి.కనుక ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆహా టీం వారు వ్యక్తం చేస్తున్నారు.

#PlayBack #Bunny Vasu #Aha OTT #ThankYou #Allu Aravind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు