ప్లేట్ పానిపూరి రూ. 20 ఇప్పుడు రూ. 100 పలుకుతోంది.. కారణమేమిటంటే..?!  

plate panipuri rs 20 is now rs 100 is saying the reason is pani poori, rock salt, pakisthan , india, rates, ayourveda - Telugu India, Pakisthan, Rock Salt

మామూలుగా బయట పానీపూరి మనం 10, లేదా 20 రూపాయలు పెట్టి పానీపూరి ని లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.ఇది అందరికీ తెలిసిన విషయమే.

TeluguStop.com - Plate Panipuri Rs 20 Is Now Rs 100 Is Saying The Reason Is

అయితే పానీపూరి ఇప్పుడు ఏకంగా యాభై నుంచి వంద రూపాయల మధ్యలో అమ్ముతున్నారు వర్తకులు.ఇందుకు కారణం లేకపోలేదు.

మామూలుగా ఈ పానీపూరి తయారు చేస్తున్న సమయంలో వారు రాక్ సాల్ట్ ను రుచి కోసం ఉపయోగిస్తారు.అయితే ఇది వరకు ఈ రాక్ సాల్ట్ ధర కేవలం పది రూపాయల నుండి 20 రూపాయలు మధ్యలో దొరికేది.

TeluguStop.com - ప్లేట్ పానిపూరి రూ. 20 ఇప్పుడు రూ. 100 పలుకుతోంది.. కారణమేమిటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఇప్పుడు ఆ రాక్ సాల్ట్ ఉప్పు కిలో ధర 150 రూపాయలకు చేరుకుంది.దీంతో రాక్ సాల్ట్ ప్రియులకు అ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

అయితే ఇందుకు కారణం లేకపోలేదు.

కాశ్మీర్ ఆర్టికల్ 370 ని తొలగించిన తర్వాత పాకిస్తాన్ తో భారతదేశం ఎటువంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోకుండా ఉండడమే.

అయితే ఈ రాక్ సాల్ట్ ను దక్షిణ భారత దేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండగలలో ఉపయోగిస్తారు.దీనిని సైంధవ లవణం, నల్ల లవణం అని వివిధ పేర్లతో పిలుస్తారు.

ఈ సాల్ట్ ఎక్కువగా మనకు పాకిస్తాన్ దేశం నుంచి దిగుమతి జరుగుతుంది.దీంతో ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధవాతావరణం నేపథ్యంలో రాక్ సాల్ట్ దిగుమతి ఇబ్బందికరంగా మారింది.

దీనితో అమాంతం రాక్ సాల్ట్ ధర కిలో 150 రూపాయలకు చేరుకుంది.ఈ ఉప్పుని అనేక ఆయుర్వేద ఉపయోగాలకు అలాగే గుజరాతి, రాజస్థానీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఇక చాలా మంది ఇష్టంగా తినే పానీ పూరిలో కూడా రుచి కోసం ఈ సైంధవ లవణాన్ని ఉపయోగిస్తారు.దీంతో సైంధవ లవణం ధర భారీగా పెరగడంతో చివరకు అ ఎఫెక్ట్ పానీపూరి మీద కూడా పడింది.

దీంతో పానిపురి ధర అమాంతం కొండెక్కింది.ఈ లవణాన్నిఎక్కువగా ఉపయోగించడం ద్వారా ప్రస్తుతం పండుగ సీజన్ రావడంతో ఈ ఉప్పుకు మరింత డిమాండ్ ఏర్పడింది.

పాకిస్తాన్ లో ఎక్కువగా లభించే ఈ రాక్ సాల్ట్ నేరుగా పాకిస్తాన్ నుండి భారతదేశానికి రాకుండా గల్ఫ్ దేశాలకు చేరుకుని అక్కడి నుంచి భారత దేశానికి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.దీంతో ఆ లవణం కోసం అంత ధర వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

#India #Rock Salt #Pakisthan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Plate Panipuri Rs 20 Is Now Rs 100 Is Saying The Reason Is Related Telugu News,Photos/Pics,Images..