చనిపోయిన డాల్ఫీన్ పొట్ట లో ప్లాస్టిక్ షవర్ గొట్టం

ప్లాస్టిక్ భూతం వల్ల మానవాళి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకూడదు అంటూ ఎంతమంది ప్రచారం చేస్తున్నప్పటికీ మానవాళి లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.ఈ ప్లాస్టిక్ భూతం వల్ల నోరు లేని జీవాలు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి.

 Plastic Shower Hose In Deade Dolphin Stomach-TeluguStop.com

చనిపోయిన డాల్ఫీన్ పొట్ట లో ప్

ఈ ప్లాస్టిక్ భూతం కారణంగా తాజాగా ఫ్లోరిడా లోని ఫోర్ట్ మేయర్స్ బీచ్ లో ఒక డాల్ఫీన్ బలి అయ్యాయంది.బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ డాల్ఫీన్ కు శవ పరీక్ష చేసిన వారు షాక్ కు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.ఆ డాల్ఫీన్ కడుపులో మొత్తం మానవ వ్యర్ధాలతో నిండిపోయినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా రెండు అడుగుల ప్లాస్టిక్ షవర్ గొట్టం కూడా ఆ డాల్ఫీన్ కడుపులో ఉండడం చూసి వారంతా షాక్ తిన్నారు.

చనిపోయిన డాల్ఫీన్ పొట్ట లో ప్

ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమీషన్ ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.కాగా, నెల వ్యవధిలోనే ఇది రెండో ఘటనగా అధికారులు పేర్కొన్నారు.ఏప్రిల్ 23వ తేదీన కూడా ఓ చిన్న డాల్ఫీన్ ఇలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చిందని తెలిపారు.ప్లాస్టిక్ భూతం మానవాళి మనుడగకే కాదు అటు జలచరాల మనుగడను కూడా ప్రశ్నార్థంగా మారుస్తుంది అని పలు సంస్థలు గగ్గోలు పెడుతున్నప్పటికీ జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.

దీనితో ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలానే చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube