ఇక‌పై ప్లాస్టిక్ జాతీయ జెండాలు బంద్‌.. అతిక్ర‌మిస్తే..!

జాతీయ జెండా అంటే ఒక దేశ ఔన్న‌త్యం.దానికి మించిన గౌర‌వం ఇంకెవ‌రికీ ఉండ‌ద‌నే చెప్పాలి.

 Plastic National Flags Are No Longer Tied If Violated, National Flog, Plastic, I-TeluguStop.com

ఒక దేశ ప్ర‌జ‌ల జీవ‌న విధానాన్ని ఆ జెండా తెలియ‌జేస్తుంది.అంత‌టి గొప్ప జెండాపై ఇప్పుడు ప్లాస్టిక్ నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి.

ఎందుకంటే ప్రస్తుత ప్ర‌పంచంలో ప్లాస్టిక్ ఎంత‌లా ఇబ్బందులు తీసుకువ‌స్తుందో చూస్తూనే ఉన్నాం.ఇక ఈ ప్లాస్టిక్ ధాటికి ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు.

దీంతో రానున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌ల సంద‌ర్భంగా మ‌న దేశంలోని కేంద్ర ప్ర‌భుత్వం అలుర్ట్ అయింది.

వెంట‌నే అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలతో పాటు కొన్ని సూచ‌న‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేయ‌డంతో ఇప్పుడు అంతా కూడా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు.

ఇప్ప‌టికే భార‌త జాతీయ జెండాను ప్లాస్టిక్‌తో త‌యారు చేయ‌డంతో విప‌రీతంగా కాలుష్యం ఏర్ప‌డుతోంది.కాబ‌ట్టి భార‌తీయులు ఎవ్వ‌రూ కూడా ప్లాస్టిక్‌తో తయారుచేసిన జెండాల‌ని వాడొద్ద‌ని, ఏ కంపెనీలు కూడా వాటిని అమ్మొద్ద‌ని కేంద్ర ఆదేశాలు జారీ చేసింది.

Telugu Indepedence Day, Central, Indiannational, National Flog, Plastic Flags, P

జాతీయ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా అంద‌రూ కూడా కేవలం పేపర్‌తో చేసిన జాతీయ త్రివ‌ర్ణ ప‌తాకాల‌నే వాడాల‌ని లేక‌పోతే చాలా ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించింది కేంద్రం.ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే గత రిపబ్లిక్​ దినోత్సవ వేడుక‌లు చేసుకునే స‌మ‌యాల్లో కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఇలాగే ఆంక్ష‌లు విధించినా కూడా అవి పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.కానీ ఈ సారి అలా కాకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించి వాటిని వాడే విధంగా ప్రోత్స‌హించాల‌ని సూచించింది.లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా చూస్తామ‌ని కూడా హెచ్చ‌రించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube