దేవుడా.. ఆ ప్లాస్టిక్ కిరీటం ధర రూ. 43 లక్షలట.. ఎందుకంటే..?!

మామూలుగా ప్లాస్టిక్ వస్తువుల విషయానికి వస్తే ధర చాలా తక్కువ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.చిన్న పిన్ను నుండి ఎంతో పెద్ద వస్తువులు అయినా సరే వాడిన ప్లాస్టిక్ క్వాలిటీని బట్టి ధరను నిర్ణయిస్తాయి కంపెనీలు.అయితే 200 రూపాయలు విలువ చేయని ఒక ప్లాస్టిక్ కిరీటం ఏకంగా రూ.45 లక్షల రూపాయలు పలికింది.ఏంటి ఒక కిరీటం అందులోనూ ప్లాస్టిక్ కిరీటం 45 లక్షలు పలికిందని ఆశ్చర్యపోతున్నారు కదా.అవునండి బాబు.ఈ ప్లాస్టిక్ కిరీటం వేలం వేసిన సంస్థ కూడా ఆ కిరీటం అమ్ముడుపోయిన ధరను చూసి ఆశ్చర్యపోయింది.

 Plastic Crown Cost 43 Lakhs, Auction, Crown, 43 Lakhs, Gandhi,plastic Crown, Ame-TeluguStop.com

మరి అంతలా ఆ ప్లాస్టిక్ కిరీటం ధర పలికింది అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది కదా.అదేమిటంటే క్లాసిక్ కిరీటానికి ఓ పెద్ద చరిత్ర ఉంది అండి బాబు.అమెరికా దేశంలోని ర్యాప్ గాయకుడు క్రిస్టఫర్ వాలేస్ ధరించిన కిరీటం ఇది.అందుకే కాబోలు ఈ కిరీటం కు అంత డిమాండ్.1972 లో జన్మించిన ఆయన ‘ద నొటోరియస్ బిగ్ బిగీ స్మాల్స్’ అనే మ్యూజిక్ బ్యాండ్ లో పాటలు పాడటం మొదలు పెట్టారు.నల్ల జాతీయుడైన అతనికి అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు కూడా ఉన్నారు.అయితే అనుకోని కారణాల వల్ల 1997లో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన వస్తువులను వేలానికి ఉంచారు.

అందులో ఆయన ధరించిన సూట్లు, బూట్లు మొదలగు వాటిని ఆయన అభిమానులు కొనుగోలు చేశారు.అయితే అప్పట్లో ఈ ప్లాస్టిక్ కిరీటాన్ని ఎవరు కొంటారులే అని అలా వదిలేశారు.ఆ తర్వాత అవి కూడా ఎంతో కొంత ధర పలుకుతాయి దాంతో డబ్బులు వస్తాయి కదా అని భావించి దానిని సౌత్ బి అనే సంస్థ వేలం వేయగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా రూ.45 లక్షలు పోసి ఆ ప్లాస్టిక్ కిరీటాన్ని పొందాడు.అతి తక్కువ పరిమాణం ఉన్న ఒక ప్లాస్టిక్ వస్తువులు ఇంత ధర పలకడం ప్రపంచంలో ఇదే తొలిసారి.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైకేల్ జాక్సెన్, జాన్ కెన్నడీ లాంటి ఎంతో మంది వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీలు వాడిన ప్లాస్టిక్ వస్తువులు కూడా ఇంత ధరలు పడక పోవడం నిజంగా గమనార్హం.

ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత అబ్రహం లింకన్ సంబంధించిన కొన్ని వెంట్రుకలు కూడా 60 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఆ తర్వాత మన భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క కళ్లజోడు కూడా ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన సంగతి కూడా విధితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube