ప్లాస్టిక్ తో అదిరిపోయే డిజైన్,తరలివెళుతున్న జనం`

ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.ఆమధ్య ప్లాస్టిక్ తీసుకువచ్చిన వారికి స్కూల్ ఫీజు లేదు అని ఒక ప్రాంతంలో, ప్లాస్టిక్ తెచ్చి ఇస్తే మిల్క్ ప్యాకెట్ ఉచితం అంటూ మరో ప్రాంతంలో ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన తీసుకురావడానికి చర్యలు చేపడుతుండడం తో ప్రతిఒక్కరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు.

 Plastic Bottle Design In Kochi-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా కేరళ లోని కొచ్చి లో ప్లాస్టిక్ తో రూపొందించిన స్ట్రక్చర్ పై ప్రత్యేక చర్చ జరుగుతుంది.చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ తో ఆ స్ట్రక్చర్ ను రూపొందించారు.

చిన్న చిన్న బాటిల్స్ ను ఉపయోగించి ఒక పెద్ద ప్లాస్టిక్ బాటిల్ లా దానిని డిజైన్ చేయడం తో జనాలు తండోపతండాలుగా దానిని చూసేందుకు తరలి వెళుతున్నారట.ప్లాస్టిక్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ దీనిని రూపొందించారు.

ఎందుకంటే దీని డిజైన్ కూడా అలానే ఉంటుంది.

ఈ పెద్ద ప్లాస్టిక్ బాటిల్‌‌ను చూసేవారికి దానిలో మనిషి చిక్కుకున్నట్లు కనిపిస్తుంది.

అంటే సింబాలిక్ గా ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి ఎలా బంధీ అయిపోతున్నాడో చూడండి అంటూ ఆ డిజైన్ ను రూపొందించారు.దీనితో ప్లాస్టిక్ కారణంగా మనిషి ఎంతగా అవస్థలు పడుతున్నాడనే దానిపై జనాలకు అవగాహన కూడా కలుగుతుంది.

కాగా ఈ బాటిల్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తో ప్రతి ఒక్కరూ కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube