పుట్టినరోజు సందర్బంగా 300మొక్కలు నాటుతున్న.. బాలికను అభిందించిన కేటీఆర్ 

ప్రకృతి మీద ప్రేమతో 65 వేల సీడ్ బాల్స్ ని తయారు చేసిన సిరిసిల్ల జిల్లా,సుద్దాల గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల దొబ్బల బ్లేస్సిని ట్విట్టర్ వేదికగా అభినందించిన మంత్రి కేటీఆర్,గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన ఎనిమిదవ పుట్టినరోజు జనవరి 31 న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటి 300 సీడ్ బాల్స్ వెదజల్లాలని నిర్ణయించుకున్న బ్లేస్సి.వచ్చే వర్షాకాలం 3 లక్షల సీడ్ బాల్స్ తయారీ చేయాలని నిర్ణయించుకున్న బ్లేస్సి కుటుంబ సభ్యులు.

 Planting 300 Plants On The Occasion Of Her Birthday  Ktr Congratulating The Girl-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా,కొనరావుపేట మండలం, సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల ప్రకాష్(ప్రకృతి ప్రకాష్) కుమార్తె బ్లేస్సి.2వ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల బ్లేస్సి పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే ప్రకృతి ప్రేమికుడు తండ్రి ప్రకృతి ప్రకాష్ బాటలో నడుస్తుంది.చిన్నతనం నుండే తన తండ్రి ప్రకృతి పట్ల ప్రేమను కనబరుస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోండటంతో స్ఫూర్తి పొందిన బ్లేస్సి తన తండ్రి బాటలో ప్రయాణిస్తూ చిన్నతనం నుండే సీడ్ బాల్స్ సేకరించడం ప్రారంభించింది.వివిధ రకాల పండ్ల విత్తనాలు,కూరగాయల విత్తనాలు,మొదలుకొని తన ఎనిమిదవ ఏట వరకు 65 వేల సీడ్ బాల్స్ సేకరించింది.

బ్లేస్సి జనవరి 31 న తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటి సిరిసిల్ల జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ వేదజల్లే కార్యక్రమం చేపట్టింది.

చిన్న వయసు నుండే ప్రకృతి మీద ప్రేమ పెంచుకొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బ్లేస్సిని మంత్రి కేటీఆర్,గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.

బాలిక తండ్రి వనజీవి రామయ్య స్ఫూర్తితో మొక్కల పెంపకం చేపట్టారు హరిత ప్రేమికుడు దొబ్బల ప్రకాశ్.మొక్కలు నాటడం అతనికి అలవాటు .విత్తనబంతులు చల్లడం దిన చర్య … రానున్న తరాలకు పండ్లు , నీడనిచ్చే చెట్లను అందించడమే తన లక్ష్యమని పేర్కొంటాడు ప్రకాశ్ .సాంస్కృతిక సారధిలో కళాకారుడిగా పనిచేస్తున్న ప్రకాశ్ మొక్కలు నాటేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు .అతడు చేస్తున్న సేవలకు గుర్తింపుగా చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ 2021 లో డాక్ట రేటు ప్రదానం చేసింది .18 లక్షల విత్తన బంతులు ప్రకాశ్ కరోనా కాలంలో ఇంట్లో ఉండి తయారుచేశాడు .ఈ పనిలో అతని భార్య మమత , కుమారుడు జాన్సన్ , కూతురు బ్లెస్సీ సహకరించారు .ఇప్పుడు కూతురు బ్లేస్సి కూడా తనవంతు బాధ్యతగా పుట్టినరోజు సందర్బంగా 65వేల మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించింది.

Planting 300 Plants On The Occasion Of Her Birthday KTR Congratulating The Girl , KTR , Planting 300 Plants, Dobbala Prakash, Santosh Kumar - Telugu Dobbala Prakash, Ktr, Santosh Kumar

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube