మాంసాహారులు - శాఖహారులు .. ఎవరు ఎక్కువ కాలం బ్రతుకుతారు?

వేల సంవత్సరాలుగా ఎన్నో వాదనలు, ఎన్నో పరిశోధనలు, ఎన్నో నమ్మకాలు .అయినా ఇప్పటికి మాంసాహారం – శాఖహారంలో ఏ పద్ధతిని అవలంబించడం కరెక్టు అనే విషయాన్ని ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

 Plant Proteins Are Safer Than Animal Proteins – Study-TeluguStop.com

అయితే ఆధునిక పరిశోధనలు చాలావరకు శాకహారం వైపు మొగ్గు చూపుతున్నాయి ఈ మధ్యకాలంలో.తాజాగా మరో అధ్యయనంలో మాంసాహారుల కన్నా శాఖహారులు ఎక్కువకాలం బ్రతుకుతారని చెప్పారు పరిశోధకులు.

జామా ఇంటర్నల్ మెడికల్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం అనిమల్ ప్రోటీన్ తీసుకున్న వారితో పోల్చుకుంటే ప్లాంట్ ప్రోటీన్ తీసుకున్నవారిలో డెత్ రేట్ చాలావరకు తగ్గుతుందట.ప్లాంట్ ప్రోటీన్‌లు పెరుగుతున్న కొద్ది 10 శాతంవరకు చావు ప్రమాదం తగ్గుతుందని, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 12 శాతం తగ్గుతుందని, పరిశోధకులు చెప్పుకొచ్చారు.

” ఇది పూర్తిగా ఆహారపు అలవాట్లును బట్టి చెప్పిన విషయం.అయితే మనిషి చావుకి ఇంకొన్నో కారణాలు ఉండవచ్చు.

అయితే అనిమల్ ప్రోటీన్ కి బదులు ప్లాంట్ ప్రోటీన్‌లు తీసుకోవడం ఉత్తమం.ఒకవేళ అనిమల్ ప్రొటీన్ ని వదులుకోలేకపోతే మాత్రం చికెన్, చేపులు తినడం మంచిది” అని శాస్త్రవేత్త మింగ్యాంగ్ సాంగ్ ఈ సందర్భంగా వాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube