విమానం వేగంగా వెళ్తుంది… కానీ అకస్మాత్తుగా విమానంలో డేంజర్ అలారం… దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ చేశారు.ఒక్కసారిగా అలారం మోగడంతో అటు ప్రయాణికులు కూడా విమానం కుప్పకూలిపోతుందేమో అని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
చివరికి సేఫ్ గా విమానం ల్యాండ్ అయింది.ఇక ఆ తర్వాత అసలు జరిగిన విషయం ఏమిటో తెలిసి విమానంలో ప్రయాణికులందరూ అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చైనాకు చెందిన 29 ఏళ్ల యువతి… యువకుడిని ని ప్రేమించింది .కానీ ఆ యువకుడు మాత్రం ఆ యువతి ప్రేమను అంగీకరించలేదు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది .ఈ క్రమంలోనే మద్యానికి అలవాటు పడింది.తాజాగా విమానంలో ప్రయాణిస్తూ మద్యం మత్తులో ఉన్న యువతిపై మనస్తాపంతో పలుమార్లు విమానం కిటికీ అద్దం పై పిడిగుద్దులు కురిపించింది.అయితే అది గమనించిన విమాన సిబ్బంది ఆ యువతిని అడ్డుకున్నారు.
కానీ అప్పటికే విమానం యొక్క కిటికీ అద్దం చిన్న మొత్తంలో బీటలు వారింది.దీంతో ఒక్కసారిగా విమానంలో డేంజర్ అలారం మోగింది.
దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఇక చేసేదేమి లేక అత్యవసరంగా సమీపంలోని జెంగ్ జోవ్ లో విమానం ల్యాండ్ చేశారు పైలెట్లు.
ఇక ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.