విమానం కుప్పకూలి 25 మంది దుర్మరణం..!  

ukreain,Plane, crash, kills 25 - Telugu Crash, Kills 25, Plane, Ukreain

ఇంజిన్ విఫలమై ఓ మిలిటరీ విమానం కుప్పకూలింది.అందులో ప్రయాణిస్తున్న 25 మంది దుర్మరణం చెందారు.

TeluguStop.com - Plane Crash Kills 25

విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు నిర్ధారించారు.ఘటనా స్థలానికి చేరుకున్న మిలటరీ సిబ్బంది మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా, విమానంలో ఎంత మంది ప్రయాణిస్తున్నారో స్పష్టత లేని కారణంగా మిలటరీ సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

TeluguStop.com - విమానం కుప్పకూలి 25 మంది దుర్మరణం..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఉక్రెయిన్ లో ఘోర ప్రమాదం సంభవించింది.ఏఎస్-26 మిలటరీ విమానం ఇంజిన్ విఫలమై ఖార్ కీవ్ ప్రాంతం పరిధిలో కుప్పకూలింది.శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందారని ఆ దేశ ప్రాజిక్యూటర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.25 మంది ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.విమానంలో ఎంత మంది ప్రయాణిస్తున్నారో స్పష్టత లేని కారణంగా మిలటరీ సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

ఈ మేరకు విమానం కూలడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు విచారణ చేపట్టేందుకు ఓ టీంను ఏర్పాటు చేశామన్నారు.త్వరలో ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకుంటామని ప్రాజిక్యూటర్ జనరల్ తెలిపారు.

దేశ ప్రాజిక్యూటర్ జనరల్ మాట్లాడుతూ.‘‘ ఖార్ కీవ్ ప్రాంతంలో ఏఎన్-26 మిలటరీ విమానం ప్రమాదానికి గురైంది.

మిలటరీలో ప్రయాణిస్తున్న 25 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందజేస్తున్నాం.

ఈ విమానం ప్రయాణిస్తున్న వారి సంఖ్య తెలియదు.అందుకే విమానం క్ర్యాష్ అయిన ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాం.

’’ అని ఆయన పేర్కొన్నారు.

#Crash #Ukreain #Kills 25 #Plane

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Plane Crash Kills 25 Related Telugu News,Photos/Pics,Images..