బాలయ్య అభిమానులకు పండుగలాంటి వార్త.. అఖండ సీక్వెల్ ప్లాన్!

Plan For Balakrishna Akhanda Sequel

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం, బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ.ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే.

 Plan For Balakrishna Akhanda Sequel-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.కలెక్షన్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది.

బోయపాటి,బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా కూడా హ్యాట్రిక్ హిట్ ను అందుకుంది.కరోనా మహమ్మారి తర్వాత వచ్చిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.

 Plan For Balakrishna Akhanda Sequel-బాలయ్య అభిమానులకు పండుగలాంటి వార్త.. అఖండ సీక్వెల్ ప్లాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేక్షకులు, అభిమానుల అంచనాలను రెట్టింపు చేస్తూ అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో కొన్ని సీన్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి.ఈ సినిమా విడుదల అయ్యి ఆరు రోజులు అవుతున్నా కూడా భారీ కలెక్షన్లతో అఖండ దూసుకెళ్తోంది.

ఈ క్రమంలోనే బాలయ్య అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఒక వార్త బలంగా వినిపిస్తోంది.అఖండ సినిమాకు సీక్వెల్ ఉండనుంది అనే ప్రచారం తెలుగు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సీక్వెల్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా లాస్ట్ లో నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను.నేను నీకు హామీ ఇస్తున్న.అంటూ చిన్నారికి బాలకృష్ణ మాట ఇస్తాడు.

దీంతో ఆ పాపకు మరొక రూపంలో సమస్య వస్తుందని, అప్పుడు అఖండ మళ్ళీ తిరిగి వస్తాడని, దీనినే సీక్వెల్ గా తీయనున్నారు అనే చర్చ జరుగుతోంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలయ్య అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు.

#Balakrishna #Akhanda Sequel #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube