ఈ కండోమ్‌ ప్యాకెట్‌ చాలా ప్రత్యేకం... తెరవాలంటే నాలుగు చేతులు కావాల్సిందే  

Placer Consentido Condoms Have Different For Other Condoms-

సుఖ వ్యాదులకు దూరంగా ఉండేందుకు, అవాంచిత గర్బం రాకుండా ఉండేందుకు ఎక్కువ శాతం జనాలు వాడే ముందస్తు జాగ్రత్త కండోమ్‌ అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.చిన్నప్పటి నుండే కండోమ్‌ గురించి తెలియజేసేందుకు ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

Placer Consentido Condoms Have Different For Other Condoms- Telugu Viral News Placer Consentido Condoms Have Different For Other Condoms--Placer Consentido Condoms Have Different For Other Condoms-

ఒకప్పుడు కండోమ్‌ అని మాట్లాడేందుకు సిగ్గు పడే పరిస్థితి ఉండేది.కాని ఇప్పుడు అలా ఏం లేదు.కండోమ్‌ కావాలంటే పూర్తి స్వేచ్చగా అడిగే పరిస్థితి ఉంది.కండోమ్‌ వాడకం అనూహ్యంగా పెరిగింది.ఈ నేపథ్యంలో రకరకాల కండోమ్స్‌ వస్తున్నాయి.కండోమ్స్‌ ఫ్లేవర్స్‌ కూడా వస్తుండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

ఇక తాజాగా ఒక కొత్త రకం కండోమ్‌ వచ్చింది.

Placer Consentido Condoms Have Different For Other Condoms- Telugu Viral News Placer Consentido Condoms Have Different For Other Condoms--Placer Consentido Condoms Have Different For Other Condoms-

ఈ కండోమ్‌ శృంగార భాగస్వామ్యుల మద్య మరింత సన్నిహిత్యం పెంచుతుంది.ఈ కండోమ్‌ ప్యాకెట్‌ ఓపెన్‌ చేయాలి అంటే ఖచ్చితంగా నాలుగు చేతులు అవసరం.రెండు చేతులతో ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు.

ఎందుకంటే ఒక్కరి చేతులతో ఓపెన్‌ చేసేందుకు వీలుగా ఆ ప్యాకెట్‌ ఉండదు.అర్జెంటేనియాకు చెందిన తులీపన్‌ అనే కండోమ్‌ తయారి సంస్థ ఈ రకపు కండోమ్‌ ప్యాన్‌ను తయారు చేసింది.

లోపల కండోమ్‌ చాలా నార్మల్‌గా రొటీన్‌గా ఉంటుంది.కాని ప్యాకెట్‌ మాత్రం విభిన్నంగా ఉంటుంది.కన్సెంట్‌ కండోమ్‌ అంటూ దీనికి పేరు.అంటే అంగీకార కండోమ్‌ అని అర్థం.

పురుషుడితో శృంగారం చేసేందుకు స్త్రీ అంగీకరించినట్లయితే ఈ కండోమ్‌ ప్యాకెట్‌ ఓపెన్‌ కు అతడికి ఆమె సాయం చేస్తుంది.అలా ఒకరికి ఒకరు సాయం చేసి, ఆ ప్యాకెట్‌ ఓపెన్‌ చేయడం వల్ల ఇద్దరి మద్య సన్నిహిత్యం ఇంకా పెరుగుతుందని తాము భావిస్తున్నాం అంటూ సదరు కండోమ్‌ తయారి సంస్థ చెప్పుకొచ్చింది.

పురుషుడు ఒక్కడే ఈ కండోమ్‌ను ఓపెన్‌ చేయలేడు, తప్పనిసరిగా తన శృంగార భాగస్వామి సాయం కావాలి.అందుకే ఇది ఇద్దరి మద్య ఒప్పందం ఉంటేనే శృంగారం జరగాలి, ఆమె అంగీకరిస్తేనే శృంగారం చేయాలని చెప్పకనే చెబుతుంది.

ఈ కండోమ్‌ వల్ల లైంగిక వేదింపులు, అఘాయిత్యాలు తగ్గాలని ఆశ పడుతున్నట్లుగా సదరు కంపెనీ కోరుతోంది.

ఈ కండోమ్‌ ప్యాకెట్‌ వల్ల అఘాయిత్యాలు ఎలా తగ్గుతాయి బాసూ అంటూ ఆ కంపెనీపై సామాన్యులు ట్వీట్స్‌ చేస్తున్నారు.

.

తాజా వార్తలు

Placer Consentido Condoms Have Different For Other Condoms- Related....