అమెరికా: కరోనా కాటుకు పిజ్జాహట్ కో ఫౌండర్ బలి

2019 ఆఖరిలో వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ గమనాన్ని తలక్రిందులు చేసింది.ఆర్ధిక వ్యవస్థను పేక మేడలా కూల్చి.

 Pizza Hut Co-founder Frank Carney Dies From Pneumonia At 82, Corona Second Wave-TeluguStop.com

లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి అంతులేని విషాదాన్ని మిగులుస్తోంది.భారతదేశంలో కూడా ఎంతో మంది రాజకీయ, క్రీడా, పారిశ్రామికవేత్తలు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఈ జాబితాలోకి ఇంకా కొత్తగా చేరుతూనే వున్నారు.

తాజాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే కన్నుమూశారు.

ఆయన వయసు 82 సంవత్సరాలు.దాదాపు పదేళ్లుగా ఫ్రాంక్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు.

దీనికి ఇప్పుడు కరోనా కూడా తోడుకావడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.అయితే చికిత్స అనంతరం ఫ్రాంక్ .కోవిడ్ నుంచి కోలుకున్నారు.కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.

కొద్దిరోజులకే కార్నేకి న్యుమోనియా వ్యాధి సోకింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో బుధవారం బుధవారం ఫ్రాంక్ తుదిశ్వాస విడిచారు.

Telugu Coronawave, Corona, Frank Carney, Hut Founder, Hutfounder-Telugu NRI

తల్లిదండ్రుల నుంచి అప్పు తీసుకుని వ్యాపారం:

1958లో సోదరుడు డాన్ (26) తో కలిసి అమెరికాలోని కాన్సాస్‌ విచితాలో 19 ఏళ్ల వయసులో పిజ్జా హట్‌ను స్థాపించారు ఫ్రాంక్ కార్నె.వారి తల్లిదండ్రుల నుంచి అప్పుగా తీసుకున్న 600 డాలర్లతో ప్రారంభించిన పిజ్జా హట్ అంచలంచెలుగా వృద్ధిని సాధించి ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా అవతరించింది.ఈ దశలో 1977లో పిజ్జా హట్‌ను 300 మిలియన్‌ డాలర్లకు పెప్సికో కొనుగోలు చేసింది.ఆ తరువాత ఇతర ఆహార సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమోటివ్, ఎంటర్‌టైన్‌మెంట్ సహా వివిధ వ్యాపార సంస్థలలో ఫ్రాంక్ పెట్టుబడులు పెట్టారు.

మరోవైపు అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది.వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలలో చేరుతున్నవారి సంఖ‍్య రోజు రోజుకు పెరుగుతోంది.

నిన్న ఒక్కరోజే 2731 మంది మహమ్మారికి బలయ్యారు.కొత్తగా 1,95,121 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 1,43,13,941కు చేరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube