పిజ్జా డెలివరీ బాయ్ అని ప్రశంసించిన పోలీసులు! అతను చేసిన పని ఏంటంటే  

Pizza Dery Boy Got Police Appreciation -

అమెరికాలో పోలీసులు ఓ పిజ్జా డెలివరీ బాయ్ ప్రశంసించడంతో పాటు, అతనిని ప్రత్యేకంగా సన్మానించారు.అతను చేసిన పనిని అందరి ముందు గొప్పగా పొగిడారు.

Pizza Delivery Boy Got Police Appreciation

ఇక పిజ్జా డెలివరీ బాయ్ చేసిన పని ఏంటంటే కన్న తండ్రి చాలాకాలంగా చేస్తున్న ఘాతుకాల నుంచి ఇద్దరు కూతుళ్లకు విముక్తి కలిగించడమే.వివరాల్లోకి వెళితే మార్క్ బూడే అనే పిజ్జా డెలివరీ బాయ్ గత ఏడాది నవంబర్లో మెటల్ అనే ప్రాంతంలో పిజ్జా ఆర్డర్ ఇచ్చిన అడ్రస్కు డోర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు.

అయితే ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి వ్యవహారశైలి కాస్త అనుమానాస్పదంగా బూడేకి కనిపించింది.

పిజ్జా డెలివరీ బాయ్ అని ప్రశంసించిన పోలీసులు అతను చేసిన పని ఏంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో అతను లోపలికి తొంగి చూడగా గదిలో ఓ చిన్నారి నగ్నంగా పడి ఉండడం కనిపించింది.

ఆ దృశ్యం చూసిన డెలివరీ బాయ్ కి అనుమానం రావడంతో లెక్సింగ్టన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అతనిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చి గదిలో ఇద్దరు బాలికలను కాపాడి వారి పైన అత్యాచారానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేశారు.

అయితే ఆ వ్యక్తి ఆ పిల్లల సొంత తండ్రి అని తెలిసి షాక్ అవ్వడం పోలీసులు వంతు అయ్యింది.ఇక ఆ కిరాతక తండ్రి నుంచి కూతుళ్లను కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్ పోలీసులు ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రం కూడా అందించారు.

దీంతో ఆ టౌన్ లో ఇప్పుడు మార్క్ బూడే చిన్న సైజు సెలబ్రిటీగా మారిపోయాడు.

తాజా వార్తలు