టిప్పు అడిగిన ఫిజ్జా డెలివ‌రీ బాయ్‌.. క‌స్ట‌మ‌ర్ ఏమిచ్చాడో తెలిస్తే...!

కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చేసిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు.కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో జనం తీవ్రమైన అవస్థలు పడ్డారు.

 Pizza Delivery Boy Asked Tip If You Know What The Customer Did-TeluguStop.com

ఫస్ట్, సెకండ్ వేవ్‌లో జనం ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఇబ్బందులు పడ్డారు.ఇక దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దాదాపుగా కొలాప్స్ కాగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

ఈ క్రమంలో హోటల్ సెక్టార్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది.కరోనా కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు ఎంతగా నష్టపోయాయో మనందరికీ తెలుసు.

 Pizza Delivery Boy Asked Tip If You Know What The Customer Did-టిప్పు అడిగిన ఫిజ్జా డెలివ‌రీ బాయ్‌.. క‌స్ట‌మ‌ర్ ఏమిచ్చాడో తెలిస్తే…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జనం అంతా ఇండ్లలోనే ఉండటం వల్ల హోం డెలివరీలు పెరిగాయి.హోటల్‌కు వెళ్లి ఫుడ్ తీసుకునే వారి సంఖ్య మొత్తంగా తగ్గిపోయింది.

ఇక డెలివరీ బాయ్‌ల సంగతి అయితే లాక్ డౌన్ ప్లస్ ప్రజెంట్ కూడా ప్రత్యేకంగా చెప్పాలి.వారికి రెస్ట్ అనేది లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే వారు ఆఫ్ తీసుకోకుండా పనులు చేస్తూనే ఉన్నారు.ఇక టిప్ కోసం వారు ఆశపడుతుంటారు.

కాగా, తాజాగా ఓ కస్టమర్ టిప్పుగా డెలివరీ బాయ్‌కు ఏం ఇచ్చాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సదరు కస్టమర్ డెలివరీ బాయ్‌కు టిప్‌గా ఏం ఇచ్చడంటే.

వైరలవుతోన్న వీడియో ప్రకారం.

పిజ్జా డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి వెళ్లి పిజ్జా బాక్స్ ఇస్తాడు.ఈ క్రమంలోనే డెలివరీ బాయ్ తనకు టిప్ ఇవ్వాలని కస్టమర్‌ను అడుగుతాడు.

దాంతో సదరు కస్టమర్ నిజాయితీగా తన వద్ద డబ్బు లేదని తెలిపాడు.అంతటితో ఆగకుండా డెలివరీ తీసుకొచ్చిన పిజ్జాలో ఒక పీస్ తీసుకోవాలని చెప్తాడు.

ఆ మాటలు విని డెలివరీ బాయ్ ఆశ్చర్యపోతాడు.నిజమా? నన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నారా ఏంటి? అని ప్రశ్నిస్తాడు.

అందుకు కస్టమర్ నిజమేనని చెప్పగా, డెలివరీ బాయ్ పిజ్జా బాక్స్‌లో నుంచి ఒక పీస్ తీసుకుని వెళ్లిపోతాడు.ఇదంతా వీడియో రికార్డు చేసి, సోషల్ మీడియాలో ఒకరు అప్‌లోడ్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.నిజాయితీ గల కస్టమర్, నిజాయితీ కలిగిన డెలివరీ బాయ్‌కు ఇచ్చిన గిఫ్ట్ పిజ్జా అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఆ వీడియోను లైక్ చేస్తూ ఇంకా వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నెటిజనాలు.

#Viral Video #CustomerGave #Asked Tip #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు