సినిమా ఇండస్ట్రీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి కొన్ని వేలమంది జీవనం సాగిస్తున్నారు.వినోదం కావాలని కోరుకునే ప్రేక్షకులు సినిమాల ద్వారా ఆ వినోదాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో సినిమా కు ప్రత్యేక స్థానం ఉందనే సంగతి తెలిసిందే.రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం వల్ల ఊహకు సాధ్యం కాని సన్నివేశాలను తెరపై చూసే అవకాశం కలుగుతోంది.అయితే సినిమా రంగానికి పైరసీ వల్ల భారీగా నష్టం వాటిల్లుతున్న సంగతి తెలిసిందే.హాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు సైతం పైరసీ బారిన పడుతున్నాయి.
అయితే ఈ పైరేటెడ్ సైట్ల ఆదాయం ఏకంగా 9,660 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.కేవలం యాడ్ల ద్వారానే పైరేటెడ్ సైట్లకు ఈ మొత్తం ఆదాయంగా వస్తున్నట్టు తెలుస్తోంది.
కంపెనీల నుంచి కూడా ఈ పైరేటెడ్ సైట్లకు భారీగా ఆదాయం చేకూరుతుంది.

ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు సైతం పైరేటెడ్ సైట్లకు భారీగా ఆదాయం చేకూరడానికి పరోక్షంగా కారణమవుతున్నాయి.ప్రముఖ సెర్చ్ ఇంజన్లతో పాటు, సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు సైతం పైరేటెడ్ సైట్లకు ఆదాయాన్ని చేకూరుస్తుండటం గమనార్హం.ప్రపంచ దేశాల్లో ఏకంగా 84,000 పైరేటెడ్ సైట్లు ఉన్నాయి.
ప్రధాన కంపెనీలు యాడ్స్ ఇవ్వకుండా ఉంటే పైరేటెడ్ కంపెనీలకు ఆదాయం భారీగా తగ్గుతుంది.
మరి భవిష్యత్తులో ప్రధాన కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తాయో చూడాల్సి ఉంటుంది.
పైరసీ వల్ల సినిమా నిర్మాతలకు మాత్రం భారీ మొత్తంలో ఆదాయం తగ్గుతుండటంతో పాటు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.ఓటీటీలలో రిలీజైన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సైతం పైరేటెడ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి.
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయిలో పైరేటెడ్ సైట్లను కట్టడి చేయలేకపోతుండటం గమనార్హం.పైరసీని ఆపగలిగితే సినిమా ఇండస్ట్రీకి ఎంతో ప్రయోజనం చేకూరనుంది.