జాత్యహంకారం.. వివక్షపై జీవితాంతం పోరాటం, అమెరికన్ దిగ్గజ పైలట్ మెక్‌గీ కన్నుమూత

అమెరికన్ సైన్యంలో జాత్యహంకారం, వివక్షలపై పోరాడిన పైలట్ చార్లెస్ మెక్‌గీ కన్నుమూశారు.ఆయన వయసు 102 సంవత్సరాలు.

 Pioneering Us Military Pilot Charles Mcgee Dies At 102,  American, Mcgee In All-TeluguStop.com

ఆదివారం ఉదయం మెక్‌గీ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.అమెరికాలో తొలి ఆల్ బ్లాక్ ఏవియేషన్‌లో మేక్‌గీ సభ్యుడు.

రెండు దశాబ్దాల సుదీర్ఘ కేరీర్‌లో ఆయన 400కు పైగా మిషన్లలో పాలుపంచుకున్నారు.రెండవ ప్రపంచ యుద్ధం, వియత్నాం, కొరియా యుద్ధాల్లో మెక్‌గీ సేవలందించారు.

మెక్‌గీ మరణం పట్ల యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అమెరికా ఒక వీరుడిని కోల్పోయిందని లాయిడ్ వ్యాఖ్యానించారు.

రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అయిన మెక్‌గీ.1942లో 23 సంవత్సరాల వయసులో సైన్యంలో ప్రవేశించారు.ఆయన మొదటి నల్లజాతి మిలటరీ ఏవియేటర్‌లలో ఒకరు.మెక్‌గీ యూనిట్‌ను ‘‘టుస్కేగీ ఎయిర్‌మెన్’’ అని పిలుస్తారు.రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం దేశంలో అతిపెద్ద ఉద్యోగదాతగా అవతరించింది.అయితే యూనిట్లు, శిక్షణ, సౌకర్యాలు మాత్రం వేరు చేయబడ్డాయి.

కానీ 1941లో యూఎస్ కాంగ్రెస్ .ఆర్మీ ఎయిర్‌కార్ప్స్‌ను ఆల్ బ్లాక్ కంబాట్ విభాగాన్ని సృష్టించాల్సిందిగా ఒత్తిడి చేసింది.దీనికి అయిష్టంగానే అంగీకరించిన ఆర్మీ ఎయిర్‌కార్ప్స్.అలబామాలోని టుస్కేగీలో వున్న రిమోట్ ఎయిర్‌ఫీల్డ్‌కు యూనిట్‌ను పంపింది.వారిని మిగిలిన సైన్యం నుంచి వేరుగా వుంచింది.ఇది పైలట్ నావిగేటర్లు, మెకానిక్స్, గ్రౌండ్ సిబ్బందికి శిక్షణా స్థలంగా మారింది.

2011లో మెక్‌గీకి నేషనల్ ఏవియేషన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కింది.సాయుధ దళాల నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత మెక్‌గీ .టుస్కేగీ ఎయిర్‌మెన్‌లో పాఠాలను బోధించడంతో పాటు యువతను ఏవియేషన్ వైపు నడిపించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు.2007లో అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌ను అందుకున్న యూనిట్‌లో సభ్యులలో మెక్‌గీ కూడా ఒకరు.2020లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.మెక్‌గీని స్టేట్ ఆఫ్ ది యూనియన్‌కు ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే ఆయనకు బ్రిగేడియర్ జనరల్‌గా పదోన్నతి కల్పించారు.

Pioneering US Military Pilot Charles McGee Dies At 102, American, McGee In All Black Aviation , US Secretary Of Defense Lloyd Austin, Retired Brigadier General, Tuskegee Airmen, Army Air Corps All Black Combat, National Aviation Hall Of Fame - Telugu American, Aircorps, Mcgee Black, National Hall, Militarypilot, Tuskegee Airmen

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube