వెలుగు చూసిన మరో దారుణం..పిన్ని పైనే కన్నేసిన యువకుడు       2018-04-23   22:12:17  IST  Raghu V

రోజు రోజు కి ఎదో ఒక చోట వావివరసలు మర్చి పోతున్న మృగాళ్ళ వికృత చేష్టలు బయటపడుతున్నాయి..నిన్న కాక మొన్న సొంత తల్లిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ కన్న కొడుకు కామాంధ నీచ చరిత్ర బహిర్గతం అయ్యి అవ్వక ముందే మరో దారుణం వెలుగు చూసింది…రోజు రోజుకి మానవీయ విలువలు తగ్గిపోతున్నాయి అని చెప్పడానికి నిదర్సనం నిన్న జరిగిన సంఘటనే..పిల్లలని ఎదిగే క్రమంలో సరైన దారిలో గనుకా పెట్టక పొతే వారి జీవితంలో ఎలాంటి చెడు పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో ఇప్పుడు జరుగుతున్న దారుణమైన సంఘటనలే సాక్ష్యం అవుతున్నాయి.

వావివరసలు మరిచి.. చిన్నమ్మపైనే ఓ యువకుడు అత్యాచారానికి తెగబడ్డ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలోని ఓ తండాకు చెందిన శ్రీకాంత్‌.. అతనికి వరసకి పిన్ని అయ్యే మహిళ పై కన్నేశాడు..భర్తని కోల్పోయిన ఆమె కూలి పని చేసుకంటూ జీవనం సాగిస్తోంది అయితే వరుసకు పిన్ని అయ్యే మహిళను శ్రీకాంత్ ఆదివారం రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నం చేశాడు అయితే

ఆమె బిగ్గరగా అరవడం మొదలు పెట్టడంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి ఇంట్లో నుంచి బలవంతంగా పొలంలోకి తీసుకెళ్లాడు. కట్టెతో దాడి చేశాడు. అనంతరం ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని శ్రీకాంత్‌ తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా ఆమెపైనే దాడి చేయడం గమనార్హం దాంతో భాదితురాలు పోలీసులని ఆశ్రయించింది..అయితే శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు విచారణ జరిపి అతనిపై కేసులు నమోదు చేయనున్నారు..