'పైనాపిల్'తో కిడ్నీలో రాళ్లు మాయం.. ఎలా అంటే?

పైనాపిల్ పండు గురించి అందరికీ తెలిసిందే.దీన్ని తెలుగులో అనాస పండు అని పిలుస్తారు.

 Pineapple Will Kill Kidney Stones-TeluguStop.com

పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.ఈ పండు రుచికి పుల్లగా ఉన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అన్ని రకాల పండ్ల తో పోలిస్తే ఈ పైనాపిల్ చాలా భిన్న మైనది.పైనాపిల్ లో 85 శాతం నీరు ఉంటుంది.

 Pineapple Will Kill Kidney Stones-పైనాపిల్’తో కిడ్నీలో రాళ్లు మాయం.. ఎలా అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చక్కెర 13 శాతం ఉంటుంది.ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, సి లను కలిగి ఉంటాయి.

పైనాపిల్ మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను కరిగించడానికి సహాయపడుతుంది.అంతేకాదు కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ పండు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.అంతేకాకుండా ఈ పండు పచ్చ కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది.ఈ పండును ముక్కలుగా చేసి తేనె కలుపుకుని తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది.

నడుము నొప్పికి ఈ పండు బాగా సహాయపడుతుంది.శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి సన్నగా చేస్తుంది.

పైనాపిల్ చర్మ సౌందర్యానికి పనిచేస్తుంది.అందాన్ని పెంపొందించడంలో ఈ పండు ఉపయోగపడుతుంది.గొంతులో ఏదైనా నొప్పి ఉంటే, ఏదైనా గాయం లాంటి సమస్య ఉంటే వాటి నుండి ఈ పండు ఉపశమనం కలిగిస్తుంది.పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ముఖంలో నిగారింపు వస్తుంది.

ఈ పండు ఆహార పదార్థాలు సులువుగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

పైనాపిల్ ను చిన్నపిల్లలకు జ్యూస్ లా కలిపి ఇస్తే వారి శరీరం పెరుగుదలకు, ఎముకలు దృఢంగా ఉండాటానికి ఉపయోగపడుతుంది.

పైనాపిల్ ఆకుల రసం కడుపులో ఉండే మలిన పదార్థాలను పోగొడుతుందని వైద్య నిపుణులు తెలిపారు.ముఖ్యంగా ఈ పండును గర్భిణీ స్త్రీలు తినకూడదు ఈ పండు తినడం వల్ల గర్భసంచిలో సమస్యలు ఎదురవుతాయి.

చూశారుగా.ఈ జాగ్రత్తలు తీసుకొని పండును తింటే మంచిది.

#Health Tips #Pineapple #Lifestyle #Kidney Stones

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు