ఫైలట్ సాహసం : ఇంటిపై విమానాన్ని ల్యాండ్ చేసి 26మందిని కాపాడారు..

కేరళ వరదల్లో చిక్కుకున్న ఇరవైఆరుమందిని కాపాడాడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పెద్ద సాహసమే చేసింది.ఏకంగా విమానాన్ని ఒక ఇంటిపై ల్యాండ్ చేశారు.

 Pilot Who Executed Rooftop Landing During Kerala Flood Rescue Ops-TeluguStop.com

ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా క్షణాల్లో ఇల్లు కూలిపోవడమే కాదు.విమానం పేలి ముక్కలైపోయేది.

అంతటి సాహసం చేసిన ఆ ఫైలట్ ఇతర సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో చూస్తుంటే క్షణంపాటు ఊపిరితీసుకోవడం మానేసి,వారి ధైర్యసాహసాలకు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి…

చాలకుడిలోని ఓ ఇంట్లో 26మంది చిక్కుకుపోయారు.బోట్లు వెళ్లలేని ఆ ప్రాంతానికి నావికాదళం సీకింగ్ 42బీ హెలికాప్టర్‌తో వెళ్లింది.అయితే, చుట్టూ నీరు ఉండటంతో హెలికాప్టర్‌ను ఎక్కడ దించాలో పైలెట్‌కు అర్థం కాలేదు.

కానీ, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి వరద బాధితులు చిక్కుకుపోయిన ఇంటిపైనే ఎంతో చాకచక్యంగా ల్యాండ్ చేశారు.ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా హెలికాప్టర్ పేలిపోయి ముక్కలైపోయేది.

ఇంటిపైన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే.ఎనిమిది నిమిషాల్లో 26మందిని అందులో ఎక్కించారు.

వెంటనే ఎంతో జాగ్రత్తగా హెలికాప్టర్‌ను గాల్లోకి లేపారు పైలెట్.కాగా, ఇదంతా వీడియోలో తీయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

హెలికాప్టర్ పైలట్, ఇతర సహాయక సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ రెస్క్యూకి సారధ్యం వహించిన అభిజిత్ మాట్లాడుతూ వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు మరో ఆలోచన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, హెలికాప్టర్ చక్రాలను నేరుగా ఇంటికప్పుపై ఉంచితే ఆ బరువంతా ఇంటిపై పడుతుంది.అప్పుడు ఇంటిపై ఒత్తిడి పెరిగి ఇళ్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది.దీంతో హెలికాప్టర్ బరువు మొత్తం ఇంటిపై పడకుండా చక్రాలను కాస్త గాలిలోనే ఉంచాను.

దాదాపు ఎనిమిది నిమిషాలు అలా ఒక స్థిరమైన ఎత్తులో హెలికాప్టర్‌ను ఉంచాల్సి వచ్చిందని,మరో నాలుగైదు సెకన్లపాటు హెలికాప్టర్ అలాగే ఇంటిపై ఉంచివుంటే ముక్కలైపోయేదని, దాన్ని మాటల్లో చెప్పలేమని అభిజిత్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube