మెగా హీరో ముచ్చటగా మూడు!

మెగా బ్రదర్స్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘తిక్క’ మరియు ‘సుప్రీమ్‌’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈయన ఇంతకు ముందు చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.

 As Ravikumar Chowdary Again Movie With Sai Dharam Tej-TeluguStop.com

దాంతో ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలను కూడా వెంటనే విడుదల చేసేందుకు షూటింగ్‌ను శరవేగంగా జరిపిస్తున్నాడు.ఏమాత్రం బ్రేక్‌ లేకుండా సాయి ధరమ్‌ తేజ్‌ ప్రతి రోజు కూడా ఈ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఈ రెండు చిత్రాలు షూటింగ్‌ కూడా పూర్తి కాకుండానే మరో సినిమాకు సాయి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం ప్రేక్షకుల ఆధరణకు నోచుకుంది.

ఆ సినిమాకు దర్శకత్వం వహించిన రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో మరోసారి ఈ మెగా హీరో నటించేందుకు ఓకే చెప్పాడు.ఒక యాక్షన్‌ లవ్‌ స్టోరీని ఈసారి సాయి ధరమ్‌ తేజ్‌తో తెరకెక్కించాలని చౌదరి భావిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు గోపీచంద్‌ హీరోగా ‘సౌక్యం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఆ సినిమా విడుదల అవ్వగానే సాయి ధరమ్‌ తేజ్‌తో సినిమా ప్రారంభించబోతున్నాడు.

ఈ గ్యాప్‌లో సాయి ఆ రెండు సినిమాలను ముగించే పనిలో ఉంటాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube