చుట్టూ పుణ్యస్నానాలు.. ముద్దుల్లో మైమరిచిపోయిన జంట

రోమ్‌లో ఉండేటప్పుడు రోమన్‌లాగా ప్రవర్తించాలనేది సామెత.పరిస్థితులకు తగ్గట్టు మన ప్రవర్తన కూడా ఉండాలనేది దాని అర్ధం.

 Pilgrimage Around A Mesmerized Couple In Kisses , Baths, Water, Kisses, Viral Latest, News Viral, Social Media, Netizens Fire, Mesmerized Couple-TeluguStop.com

అయితే భార్యను ముద్దు పెట్టుకున్న ఓ వ్యక్తిని అతడి చుట్టూ ఉన్నవారు చితక్కొట్టారు.ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయి, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుంటున్నారు.

అలా అక్కడ చేయడం ఆ దంపతులది తప్పేనని తీర్పిస్తున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 Pilgrimage Around A Mesmerized Couple In Kisses , Baths, Water, Kisses, Viral Latest, News Viral, Social Media, Netizens Fire, Mesmerized Couple-చుట్టూ పుణ్యస్నానాలు.. ముద్దుల్లో మైమరిచిపోయిన జంట-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా మంది ఉత్తర భారతదేశానికి తీర్ధయాత్రలకు వెళ్తుంటారు.అలా ఒక్కో ఆలయానికి వెళ్తూ, సమీపంలోని పుణ్య నదులలో స్నానం ఆచరిస్తుంటారు.తద్వారా తమ పాపాలు పోవాలని కోరుకుంటుంటారు.ఆ తర్వాత గుడిలో దేవుని దర్శనం చేసుకుని, భక్తి భావంతో మరో ఆలయానికి పయనం అవుతుంటారు.ఇదే కోవలో ఓ దంపతులు అయోధ్యకు వెళ్లారు.హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అక్కడి సరయూ నదిలో భక్తులు అంతా స్నానం చేయడానికి దిగడం చూశారు.

వారు కూడా స్నానం చేయడానికి అందులో దిగారు.ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆ దంపతులకు తమకం మొదలైంది.

చుట్టూ ఎంతో మంది భక్తులు ఉన్నారని, అది కూడా ఆధ్యాత్మిక ప్రాంతం అనే విషయాన్ని మరిచిపోయారు.భర్త తన భార్యకు ముద్దు పెడుతూ వేరే లోకాలలో మునిగి తేలుతున్నారు.

వీరి వ్యవహారం చూసిన చుట్టు పక్కల భక్తులకు మండిపోయింది.భర్తను పక్కకు లాక్కొచ్చి అతడిని చితక్కొట్టారు.

ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలాంటి పాడు పనులు ఏమిటని నిలదీశారు.ఒక్కసారిగా భక్తులు తమ భర్తపై దాడి చేయడంతో ఆ మహిళ నిర్ఖాంతపోయింది.

తన భర్తను కొట్టొద్దని భక్తులను వేడుకుంది.కొందరు భక్తులు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

దీనికి నెటిజన్ల నుంచి విశేషంగా స్పందన వస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube