ప‌ట్టాల‌పై కుప్ప‌లు, తెప్ప‌లుగా అమేజాన్ డెలివ‌రీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్‌

దోపిడీ దొంగలు అమెరికాలో రెచ్చిపోతున్నారు.అమెరికా అంతట రెచ్చిపోకపోయినా అక్కడి సరుకు రవాణా రైళ్లపై తెగబడుతున్నారు.

 Piles On Rails Rafts Amazon Delivery Packets  Shock If You Know Why, Amazon, Vir-TeluguStop.com

దీంతో అక్కడి రైల్వే వ్యవస్థ భారీ భద్రతను ఏర్పాటు చేసింది.ఎట్టకేలకు దొంగలను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టింది.

కానీ కోర్టు చేసిన పనితో ఒక్క సారి అక్కడి రైల్వే అధికారులు షాక్ తిన్నారు.ఇంతకీ అక్కడి కోర్టు ఏం చేసిందని అందరికీ అనుమానం కలుగుతుంది.

అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పు దొంగలకు వరంలా మారిందని రైల్వే అధికారులు వాపోతున్నారు.ఇలా అయితే తమ రైళ్లల్లో పంపే సరుకులను కాపాడడం చాలా కష్టమనే భావనలను వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ అక్కడి కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే.

అమెరికాలోని సరుకు రవాణా రైళ్లల్లో దుండగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.

రైళ్లల్లో పార్సిల్ చేస్తున్న అమెజాన్, ఫెడ్ ఎక్స్ వంటి సంస్థలకు చెందిన ఆర్డర్లను ఇష్టం వచ్చిన విధంగా దోసుకుపోతున్నారు.ఇలా దోసుకుపోవడంతో అమెజాన్ సంస్థకూ మరియు ఫెడ్ ఎక్స్ సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోంది.

లాస్ ఏంజెల్స్ నగరంలో జరుగుతున్న ఇటువంటి దొంగతనాలకు చెక్ పెట్టేందుకు యూనియన్ పసిఫిక్ సంస్థ ప్రయత్నాలు చేసింది.

24 గంటలు కాపాలా కాసి అధునాతన టెక్నాలజీలను ఉపయోగించి దొంగలను పట్టుకుంది.పట్టుకుని ఆ దొంగలను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పును చూసి ఆ రైల్వేస్ అధికారులు షాక్ కు గురయ్యారు.వీటిని చిన్న తప్పులుగా భావించిన కోర్టు వారికి చిన్న పాటి జరిమానాలు వేసి వదిలిపెట్టింది.

ఇలా చేయడంతో వారు 24 గంటలు గడవక ముందే జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలు చేస్తున్నారు.లాస్ ఏంజెల్స్ నగరంలోని రైల్వే ట్రాకులపై ఆన్ లైన్ ఆర్డర్ల కవర్లు కుప్పలు, తెప్పలుగా పడి ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube