పందుల పోటీ.....ఎక్కడో తెలుసా?- Pigs Jallikattu Competitions

Pigs jallikattu competitions,pigs, jallikattu ,competitions, tamilnadu, sankranti, 70-100 kgs - Telugu 70-100 Kgs, Competitions, Jallikattu, Pigs, Sankranti, Tamilnadu

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తమిళనాడు రాష్ట్రం చుట్టుపక్కల ప్రాంతాలలో బసవన్న జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు.ఒక తమిళనాడు రాష్ట్రం లోనే కాకుండా ఇక చాలా చోట్ల ఈ జల్లికట్టు నిర్వహించడం జరుగుతుంది.

 Pigs Jallikattu Competitions-TeluguStop.com

ఇందులో మంచి బరువు ఎత్తు ఉన్న బసవన్నలను ఎంచుకొని ఆ బసవన్నను పట్టుకోవడం ఈ జల్లికట్టు యొక్క ముఖ్య ఉద్దేశం.అయితే ఇందులో ఎంతో మందికి గాయాలు అవ్వడం ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది.

సాధారణంగా జల్లికట్టు ఆటకు ఎద్దుల తో పోటీ నిర్వహించడం జరుగుతుంది.కానీ తమిళనాడు రాష్ట్రంలో ట్రెండ్ ఆలోచించాలి అంటూ పందులతో జల్లికట్టు నిర్వహించారు.కొత్త ట్రెండ్ పందులతో జల్లికట్టు గెలవడం అంత ఈజీ కాదు అంటూ ఈ పోటీలు నిర్వహించారు.ఈ వింతైన పోటీలో గురించి తెలుసుకుందాం.

 Pigs Jallikattu Competitions-పందుల పోటీ…..ఎక్కడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా అల్లినగరం ప్రాంతంలో పందులతో జల్లికట్టు పోటీలను నిర్వహించారు.ఈ జల్లికట్టు పోటీని తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల అందరూ వచ్చారు.వల్లినగర్ ప్రాంతంలో కురువర్ వర్గానికి చెందిన 50 కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి.సంక్రాంతి సందర్భంగా వన వేంగైగల్ పార్టీ ఆధ్వర్యంలో పందుల జల్లికట్టు ను నిబంధనలతో నిర్వహించారు.

ఈ పోటీల్లో 70 నుంచి 100 కిలోలు బరువు ఉన్న పందులు మాత్రం పాల్గొనాలి.తాటి మానులతో ఏర్పాటుచేసిన వడి వాసన్ నుంచి 3 అడుగుల దూరం వెళ్ళిన తర్వాతే ఆ పంది ని పట్టుకోవాలి.

చివరి లైన్ దాటే లోపు దాని వెనుక కాళ్ళు మాత్రమే పట్టుకొని ఆపాలి అలా ఆపిన వారు విజేతగా నిలుస్తారు.పట్టుకోకుండా లైన్ దాటే పంది ని విజేతగా ప్రకటిస్తారు.

ఈ జల్లికట్టు పోటీకి 12 పందులు రాగా 45 మంది యువకులు పాల్గొన్నారు.ఈ పోటీలను వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా వచ్చారు.

#70-100 Kgs #Sankranti #Jallikattu #Pigs #Tamilnadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు