పిగ్మెంటేషన్ సమస్యనుంచి బయట పడటానికి.... టమోటా ఫేస్ ప్యాక్స్

Pigmentation Removal Tomato Face Packs

శరీరంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ముఖం మీద చర్మం ముదురు రంగులోకి మారుతుంది.దానినే పిగ్మెంటేషన్ సమస్య అని అంటూ ఉంటాం.

 Pigmentation Removal Tomato Face Packs-TeluguStop.com

ఈ సమస్య పరిష్కారానికి టమోటా చాలా బాగా సహాయపడుతుంది.టమోటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మరియు పోషకాలు ఈ నల్లని ప్యాచెస్ ని తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఇప్పుడు ఈ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

 Pigmentation Removal Tomato Face Packs-పిగ్మెంటేషన్ సమస్యనుంచి బయట పడటానికి…. టమోటా ఫేస్ ప్యాక్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో రెండు స్పూన్ల టమోటా గుజ్జు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే తొందరగా పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.

అయితే ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేయాలి.

Telugu Curd, Face, Problems, Skin, Telugu Tips, Tomato Face, Tomatoes Skin-Telugu Health

రెండు స్పూన్ల టమోటా గుజ్జులో అరస్పూన్ పొటాటో రసాన్ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు వృత్తాకార మోషన్ లో మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి.

పైన చెప్పిన చిట్కాలలో మీకు సులువుగా ఉన్న చిట్కాను పాటించి సులభంగా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడి అందమైన,మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోండి.

#Tomato #Tomatoes #Problems #Curd

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube