హైదరాబాద్‌ను వణికిస్తున్న పావురాలు.. నగరం నుండి వాటిని పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు

హైదరాబాద్‌ మహానగరం సంవత్సరం సంవత్సరంకు పెరుగుతూనే ఉంది.ఇప్పటికే కోటి జనాబా దాటిన హైదరాబాద్‌ నగరం ఇంకా విస్తరిస్తూనే ఉంది.

 Pigeon Control In Hyderabad-TeluguStop.com

దేశ వ్యాప్తంగా ఉన్న అనేక జాతుల వారు, మతాల వారు, రాష్ట్రాల వారు హైదరాబాద్‌లో నివసిస్తున్న విషయం తెల్సిందే.ఇతర దేశాల్లో కూడా హైదరాబాద్‌కు మంచి పేరున్న నేపథ్యంలో దేశంలోనే ముఖ్య పట్టణాల్లో హైదరాబాద్‌ చేరింది.

అయితే హైదరాబాద్‌లో కూడా కొన్ని లోపాలున్నాయి.ఆ లోపాలను సరి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో పావురాలు తప్ప మరే పక్షి జాతి మనుగడకు సాధ్యం కాకుండా పోయింది.

హైదరాబాద్‌లో లెక్కకు మించిన పావురాలు పెరిగి పోతున్నాయి.

పావురాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇతర పక్షులు హైదరాబాద్‌లో ఉండలేక వెళ్లి పోతున్నాయి.గతంలో ఇతర పక్షలు ఏర్పాటు చేసుకున్న గూళ్లను పావురాలు ఆక్రమించుకుని వాటికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి.

ఆహారం విషయంలో కూడా పావురాళు వేరే పక్షులకు దొరకకుండా చేస్తున్నాయి.దాంతో హైదరాబాద్‌లో ఈమద్య కాలంలో పావురాలు తప్ప మరే పక్షులు కనిపించడం లేదు.

ఇది చాలా ప్రమాదకర విషయమని గుర్తించిన ప్రభుత్వ వర్గాల వారు హైదరాబాద్‌ నుండి సగానికి పైగా పావురాలను తరిమేయాలనే నిర్ణయానికి వచ్చారు.

మక్కా మసీదుతో పాటు ఇంకా పలు ప్రాంతాల్లో పావురాలకు స్థావరాలు ఉన్నాయి.అక్కడకు వెళ్లే టూరిస్తులు మరియు స్థానికులు పక్షులకు ఎక్కువ మొత్తంలో మేత వేస్తున్న కారణంగా వాటి సంతాన అభివృద్ది స్పీడ్‌ గా జరుగుతుందని నిర్థారణకు వచ్చారు.పావురాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇతర పక్షుల మనుగడ ఇబ్బందిగా తయారవ్వడంతో పాటు, జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

పావురాలకు చెందిన చిన్న చిన్న ఈకలు గాలిలో కలిసి అవి మనిషి శ్వాసలోకి వెళ్లి పోతున్నాయి.అలా వెళ్లడం వల్ల ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాదులు వస్తున్నాయి.

ఇక పావురాల మలం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దుర్వాసన రావడంతో పాటు, ఆ వాసన కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.అందుకే హైదరాబాద్‌లో పావురాలకు ఇకపై మేత వేయవద్దని ప్రభుత్వ వర్గాల వారు కోరుతున్నారు.మీరు హైదరాబాద్‌కు చెందిన వారైతే ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ సన్నిహితులతో షేర్‌ చేసుకోండి.పావురాలు మనకు అహ్లాదాన్ని ఇస్తాయి.కాని అదే పావురాల వల్ల అనారోగ్యం అన్నప్పుడు వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube