ఎమ్మెల్యే లకు జగన్ మార్క్ చూపించనున్నారా ? 

Pics Focused Entirely On Ycp Mlas

సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకు వచ్చేస్తోంది.చూస్తుండగానే రెండున్నర సంవత్సరాలు ముగిసిపోయింది.

 Pics Focused Entirely On Ycp Mlas-TeluguStop.com

ఈ రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతి పై జగన్ కు సంతృప్తి ఉన్నా, తాను అనుకున్న మేర అయితే సక్సెస్  కాలేదు అనేది జగన్ అభిప్రాయం.ప్రతిపక్షంలో ఉండగా తాను పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను తెలుసుకుని,  ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేసినా సరే ప్రజల్లో ఇంకా ఏదో తెలియని అసంతృప్తి ఉందనేది జగన్ కు అందిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది.

  క్షేత్ర స్థాయిలో జనాల్లో ఎందుకు వ్యతిరేకత పెరుగుతోంది అనే విషయాన్ని జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.క్రమక్రమంగా తమ రాజకీయ ప్రత్యర్ధులు బలపడుతుండడం,  చిన్న చిన్న విషయాలను సైతం హైలెట్ చేసుకుని వారు లబ్ధి పొందుతున్న తీరు జగన్ కాస్త ఆందోళన పెంచుతోంది.
     2019 ఎన్నికల్లో వైసిపి కి 151 సీట్లు దక్కినా,,  ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆ స్థాయిలో సీట్లను సంపాదించడం అసాధ్యం అనే విషయాన్ని జగన్ గుర్తించారు.దీనికి కారణం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పెరిగిన వ్యతిరేకత.

 Pics Focused Entirely On Ycp Mlas-ఎమ్మెల్యే లకు జగన్ మార్క్ చూపించనున్నారా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  వారు జనాల్లో తిరగకపోవడం,  వారి సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడం ఇవన్నీ కారణాలు గా అంచనా వేస్తున్నారు.ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన నివేదికలు ఇవన్నీ ఎమ్మెల్యేలపై జగన్ దృష్టి పెంచడానికి కారణంగా కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓటమి చెందడానికి కారణం ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేకపోవడం,  అవినీతి వ్యవహారాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం తీసుకువచ్చాయి.ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో నియోజకవర్గం లో పర్యటనలు చేయకపోవడం,  ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఇవన్నీ రాబోయే రోజుల్లో తమకు ఇబ్బందులు తీసుకొస్తాయని జగన్ గుర్తించారు.
 

Telugu Ap Cm Jagan, Chandrababu, Ysrcp Mla-Telugu Political News

   అందుకే ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో మకాం వేసి మరి జనాల్లోకి వెళ్లాలని , ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించాలని, నియోజకవర్గంలో పెరిగిపోయిన ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని టార్గెట్ విధించారట.పూర్తిగా నియోజకవర్గం లో ఉంటూ ప్రజల్లో గ్రాఫ్ పెంచు కోకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదనే సంకేతాలు సైతం జగన్ నుంచి వెళ్ళినట్లు సమాచారం.దీనికి తోడు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరు,  నియోజకవర్గాల్లో పరిస్థితులపై జగన్ ప్రత్యేకంగా సర్వేలు చేస్తున్నారు .దీనికితోడు నిఘా వర్గాల రిపోర్టులు ఎప్పటికప్పుడు జగన్ కు అందుతుండటంతో ఈ స్థాయిలో ఫోకస్ పెంచినట్టు గా కనిపిస్తున్నారు.

#Chandrababu #YSRCP MLA #Welfare Schemes #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube