జగన్ తగ్గేదేలే : కొత్త జిల్లాల కు నోటిఫికేషన్ ? 

ఏపీ సీఎం జగన్ తగ్గేదేలే అన్నట్టుగా ఏ విషయంలోనూ రాజీపడేందుకు ఇష్టపడడం లేదు.ఏ విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు.

 Pics Are Declining Notification To New Districts , Ap Cm Jagan, New Dristicts,-TeluguStop.com

ఎన్నో వివాదాస్పద నిర్ణయాలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు.జగన్ నిర్ణయాలపై ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు చేస్తున్నా, జగన్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.

ఇదే విధంగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై జగన్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు.ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు .ఇప్పుడు దానికి సంబంధించిన తుది కసరత్తు మొదలైంది.

రేపు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీలో నోటిఫికేషన్ వెలవెలబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అన్ని వ్యవహారాల పైన అధికారులు అప్రమత్తంగా ఉండాలని,  వేగవంతంగా ఈ పనులు ముందుకు వెళ్లేలా చూడాలని ఇప్పటికే అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారట.ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని జగన్ నియమించారు.

ఈ కమిటీ ఇప్పటికే నివేదికను అందించడంతో ఇక వేగవంతంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.

ఈ కొత్త జిల్లాల ఏర్పాటు తో ఏపీలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని,  పరిపాలనా పరమైన ఇబ్బందులు తొలగుతాయి అని, ఇంకా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుందనే ఉద్దేశంలో జగన్ ఉన్నారు.

అసలు 2019 ఎన్నికలకు ముందు జగన్ నిర్వహించిన పాదయాత్ర సమయంలో ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి హామీ ఇచ్చారు.ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పుడు జగన్ ఆలోచన అమలు అయితే ఏపీలో మొత్తం 26 కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయి.

దీనిపై తాజాగా మరోసారి అధికారులతో నిర్ణయించి రేపు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్నాయి.అరకు పార్లమెంట్ నియోజకవర్గం అతిపెద్ద గా ఉండడంతో, ఈ ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

 కొత్త జిల్లాల ఏర్పాటు తో మరింత అభివృద్ధి సాధ్యం అవడం తో పాటు,  కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉండడంతో ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.రాబోయే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube