పవన్ టూర్‌లో వాళ్లదే హవా  

Picpoketers Show Talent In Pawan Kalyan Rayalaseema Tour-pawan Kalyan,picpocketers,rayalaseema Tour,theives

జనేసన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా రాయసీమ ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలకు జేబుదొంగలు చుక్కలు చూపించారు.పవన్ టూర్‌ను వారు చాలా తెలివిగా వినియోగించుకున్నారు.రాయలసీమ టూర్‌లో భాగంగా రేణిగుంట ఏయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్‌ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు.

Picpoketers Show Talent In Pawan Kalyan Rayalaseema Tour-pawan Kalyan,picpocketers,rayalaseema Tour,theives Telugu Viral News Picpoketers Show Talent In Pawan Kalyan Rayalaseema Tour-pawan Picpocketer-Picpoketers Show Talent In Pawan Kalyan Rayalaseema Tour-Pawan Picpocketers Rayalaseema Tour Theives

ఇదే అదునుగా భావించిన జేబుదొంగలు కూడా వారిలో కలిసిపోయారు.దీంతో అక్కడ చిన్నపాటి తొక్కిసలాట జరిగింది.దీంతో జేబుదొంగలు తమవద్ద ఉన్న కత్తెరలకు పనిచెప్పారు.అభిమానులు, కార్యకర్తల సెల్‌ఫోన్‌లు, పర్సులు అందినకాడికి దోచుకున్నారు.

దాదాపు 30 నుంచి 45 మంది తమ జేబులకు కత్తెర పడినట్లు గుర్తించారు.తమవద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లు మాయమైనట్లు గుర్తించి వారు లబోదిబోమన్నారు.కాగా వారంతా రేణిగుంట పోలీసులను ఆశ్రయించారు.అయితే ఇలాంటి సందర్భాల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వారికి సూచించినట్లు తెలిపారు.

ఏదేమైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మొత్తానికి పవన్ టూర్ ఇలా జేబుదొంగలకు బాగా పనికొచ్చిందంటూ పలువురు కామెంట్లు విసురుతున్నారు.