పౌర్ణమి రోజు కుబేరుడికి ఊరగాయ సమర్పిస్తే..?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యలను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు.ఈ రెండు రోజులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

 Kubera, Pickle, Pooja, Full Moon Day-TeluguStop.com

ఈ క్రమంలోనే మే 26న బుధవారం వచ్చేటటువంటి వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత కలిగి ఉంది.వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

వైశాఖ శుక్ల చతుర్దశి రోజు బుద్ధుడు జన్మించడం వల్ల వచ్చిన బౌద్ధ మతస్తులు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు.ఎంతో విశిష్టత కలిగిన ఈ వైశాఖ పౌర్ణమికి కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మన ఇంట్లో సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు.ముఖ్యంగా పౌర్ణమి రోజు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి కలకండ కామాక్షి దీపంలో వేసి వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందవచ్చు.ఈ విధంగా చేయడం పౌర్ణమిరోజు కుదరకపోతే మంగళ శుక్రవారాలలో చేసిన కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.
సంపదకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పౌర్ణమి రోజు పూజించడంవల్ల మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.కుబేరుడికి ఊరగాయలు అంటే ఎంతో ప్రీతికరం.

అందుకోసమే కుబేరుడికి ఇష్టమైన ఊరగాయలను మన ఇంట్లో నిల్వ చేసుకోవడం వల్ల సంపద పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అదేవిధంగా పౌర్ణమి రోజు మన ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం ద్వారా జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

వైశాఖ పౌర్ణమి రోజు ఈ విధంగా మహాలక్ష్మిని, కుబేరుడిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube