YouTuber Steven Schapiro : సైబర్‌ట్రక్కును టాక్సీగా మార్చేసిన యూట్యూబర్.. వీడియో వైరల్…

పాపులర్ యూట్యూబర్ స్టీవెన్ స్కాపిరో( Steven Schapiro ) పబ్లిక్‌గా వ్యక్తులను ప్రాంక్ చేసి ఆ ఫన్నీ వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటాడు.అతను ఇటీవల చేసిన ఓ కొత్త వీడియో ఇంటర్నెట్‌ను షేర్ చేస్తోంది.

 Picking Up Uber Riders In A Cybertruck Viral Video-TeluguStop.com

ఈ వీడియోలో, స్టీవెన్ యూఎస్‌లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో టెస్లా సైబర్‌ట్రక్‌( Tesla Cybertruck )ను నడిపాడు.ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారు కదా అతను చాలా ఖరీదైన సైబర్‌ట్రక్‌ను టాక్సీ లాగా మార్చేశాడు.

ఉబెర్ డ్రైవర్‌గా నటిస్తూ రైడ్ కోరుకునే వారిని ఎక్కించుకున్నాడు.ఈ యూట్యూబర్ సైబర్‌ట్రక్‌తో వారిని ఆశ్చర్యపరిచాడు.

సైబర్‌ట్రక్‌ అనేది ఇతర ట్రక్కుల కంటే చాలా భిన్నంగా కనిపించే ఒక ప్రత్యేకమైన ట్రక్.ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే టెస్లా కంపెనీ దీన్ని తయారు చేసిన విషయం తెలిసిందే.

ఇక సైబర్‌ట్రక్‌లో ఎక్కిన వ్యక్తులు చాలా ఆశ్చర్యపోయారు.వారిలో కొందరికి షాపిరో ఎవరో తెలుసు, మరికొందరికి తెలియదు.వారంతా రైడ్‌ను ఆస్వాదించారు, ఆనందించారు.జర్మనీ( Germany )కి చెందిన ఒక వ్యక్తి, అమెరికాకు చేరుకోగానే సైబర్‌ట్రక్కులో ప్రయాణించే అవకాశం దక్కింది.దాంతో అతడు చాలా ఆశ్చర్యపోయాడు.ఈ సైబర్‌ట్రక్ చాలా వేగంగా దూసుకెళ్తుంది.

చాలా మంది దృష్టిని ఆకర్షించింది.వీధుల్లోని ప్రజలు దానిని ఫోటోలు తీయడంతోపాటు తదేకంగా చూశారు.

షాపిరో డ్రైవింగ్ చేస్తూ ఎక్కువ మందికి రైడ్‌లు ఇస్తూనే ఉన్నాడు.సైబర్‌ట్రక్‌లో ప్రయాణించిన ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు.

ఈ సైబర్‌ట్రక్ వీడియోకు 3 లక్షల దాక వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టారు.టెస్లా సైబర్‌ట్రక్ మొదటిసారిగా నాలుగు సంవత్సరాల క్రితం ప్రజలకు చూపించారు.ఇప్పుడు ఇది అందుబాటులోకి వచ్చింది.

ఇది ఇతర ట్రక్కుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.సైబర్‌ట్రక్‌ను రహదారిపై వెళ్లేలా సిద్ధం చేయడానికి టెస్లాకు చాలా సమయం పట్టింది.

ఇప్పుడు, ఇది చివరకు USలో అందుబాటులోకి వచ్చింది.

సైబర్‌ట్రక్ ధర 60,990 డాలర్లు (రూ.50.70 లక్షలు), ఇది టెస్లా 2019లో చెప్పిన దానికంటే ఎక్కువ.సైబర్‌ట్రక్ మెరిసే మెటల్‌తో, పదునైన అంచులతో చిత్రంగా కనిపిస్తుంది.ఇది 1977 నాటి జేమ్స్ బాండ్ సినిమాలో లాగా నీటి అడుగున వెళ్లగలిగే కారులా ఉంది.అని టెస్లా యజమాని మస్క్ చెప్పారు.ఈ లింక్‌ https://youtu.be/pTpLdPCSkuE?si=05yQ_3NOBqmWAAeGపై క్లిక్ చేయడం ద్వారా వీడియోను మీరు చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube