ఫోటో టాక్ : ఒక్క హిట్ తో మొత్తం లుక్ మార్చిన విశ్వక్ సేన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు యాకుబ్ అలీ దర్శకత్వం వహించిన “వెళ్ళిపోమాకే” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన “యంగ్ హీరో విశ్వక్ సేన్” గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిన విశ్వక్ సేన్ ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినటువంటి “ఈ నగరానికి ఏమైంది” అనే చిత్రం ద్వారా బాగానే అలరించాడు.

 Tollywood Young Hero Vishwak Sen Change His Look For Pagal Movie, Vishwak Sen, T-TeluguStop.com

  ఆ తర్వాత తానే దర్శకుడిగా మారి ఫలక్నామా దాస్ అనే చిత్రంలో హీరోగా నటించగా ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విశ్వక్ సేన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు లేక విశ్వక్ సేన్ ఇంటి వద్దనే ఉంటున్నాడు.

 దీంతో తాజాగా విశ్వక్ సేన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన కొత్త లుక్  పోస్టర్ ని విడుదల చేశాడు.ఇందులో సిల్కీ జుట్టుతో నోట్లో బీడీ పెట్టుకొని ఖరీదైన షర్టు వేసుకొని చాలా క్లాస్ గా కనిపిస్తూనే మాస్ లుక్ ఇచ్చాడు.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో విశ్వక్ సేన్ కొత్త లుక్ తెగ వైరల్ అవుతోంది. అంతేగాక విశ్వక్ సేన్ అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ “అన్న ఈజ్ ఆన్ ఫైర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ “పాగల్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.దీంతో చిత్రంలోని పాత్ర కోసమే విశ్వక్ సేన్ ట్రెండీగా తన లుక్ ని మార్చేశాడని పలు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ ఏడాది విశ్వక్ సేన్  హీరోగా నటించిన “హిట్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కానీ అంతలోనే కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడడంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

దీంతో ప్రస్తుతం  పాగల్ చిత్రంతో విశ్వక్ సేన్ హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube