అవకాశాల కోసం బాగానే కష్ట పడుతున్న బిగ్ బాస్ బ్యూటీ...

తెలుగులో 2014వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించిన “మాయ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగు బ్యూటీ “నందిని రాయ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె తెలుగులో నటించిన చిత్రాలతో కంటే బిగ్ బాస్ రెండవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

 Pic Talk : Telugu Big Boss Contestant Nandini Rai Teasing With Her Bold Look, Na-TeluguStop.com

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులో లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటుంది.దీంతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులతో అందుబాటులో ఉంటోంది.

అయితే ఈ మధ్య కాలంలో నందిని రాయ్ సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొంతమేర ఈ మధ్య బోల్డ్ తరహాలో ఉన్నటువంటి ఫోటోలని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ సినీ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

 దీంతో ఆమె అందాలకి ఫిదా అయినటువంటి నెటిజన్లు తొందర్లోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతారంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే అందం, అభినయం, చక్కని ముఖ కవళికలు నటనా ప్రతిభ ఉన్నటువంటి నందిని రాయ్ ఎందుకో సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమవుతోందని కాబట్టి ఆ లోటుపాట్లను సరిగా గుర్తిస్తే ఖచ్చితంగా నటిగా మంచి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అంటూ సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే తెలుగులో నందిని రాయ్ పలాస 1978 చిత్ర దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహించిన  “మెట్రో కథలు” అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కొంతమేర బోల్డ్ తరహాలో కనిపించినా ప్రేక్షకులను నందిని రాయ్ బాగానే ఆకట్టుకుంది.

దీంతో ప్రస్తుతం ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube