అరెరే... ఈ హీరోయిన్ లాక్ డౌన్ లో  బాగానే సన్నబడిందే...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మదులు  దోచుకున్న తెలుగు బ్యూటీ “అంజలి” గురించి ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అంజలి స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ హీరోయిన్ గా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Pick Talk : Heroine Anjali Weight Loss In Lockdown,anjali, Telugu Beautiful Actr-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.

ఈ క్రమంలో అంజలి బరువు తగ్గేందుకు బాగానే వర్కౌట్లు మరియు ఆహార డైట్ విషయంలో కేర్ తీసుకొని దాదాపుగా ఐదు నుంచి పది కేజీల బరువు తగినట్లు సమాచారం.

అయితే ఈ మధ్యకాలంలో అంజలి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.అయితే మొదట్లో మరీ అంత బరువు లేకపోయినప్పటికీ సినిమా అవకాశాల కోసం అంజలి మరింత బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అంజలి తెలుగులో ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న “నిశ్శబ్దం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో అంజలి ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి కి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫారం లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా అంజలి తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా రెండో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube