బరి తెగించిన కామాందులు.. దివ్యాంగురాలిపై       2018-04-16   22:39:13  IST  Raghu V

రోజు రోజుకి మానవత్వం మంటగలిసి పోతోంది..నిస్సహాయంగా ఉన్న మహిళలపై కామందుల కన్ను పడుతోంది నడవలేని స్థితిలో ఉన్న వారి నుంచీ చిన్న చిన్న పిల్లలపై సైతం హత్యాచారాలకి పాలపడుతున్నారు..మొన్న జరిగిన ఎనిమిదేళ్ళ బాలిక హత్యాచార హత్య ఉదంతం మరువక ముందే తాజాగా ఓ దివ్యాంగురాలిపై జరిగిన హత్యచార ఉదంతం కలకలం రేపుతోంది. వవరాలలోకి వెళ్తే..

సరిగ్గా నడవడమే కష్టం గా ఉన్న ఓ దివ్యాంగురాలిని చూస్తే సాయం చేయాలనీ అనిపిస్తుంది అయితే ఆ ముగ్గురికి మాత్రం ఆమెపై పశుత్వానికి పాల్పడాలనిపించింది.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో ఆదివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులుచెప్పిన వివరాల ప్రకారం పూసపాటిరేగకు చెందిన అవివాహిత అయిన ఓ యువతి(24) తన అక్క ఇంటికి వెళ్లే ఆలోచనతో ఆటోలో ఆదివారం సాయంత్రం విజయనగరం కోట వద్దకు చేరుకుంది..ముందు తన బావ తనని తీసుకుని వెళ్ళడానికి వస్తాడని భావించినా తానూ రాకపోవడంతో అటుగా వచ్చిన ఆటోని ఆపి పూల్‌బాగ్‌ వద్ద దిగుతానని డ్రైవర్‌కు చెప్పింది.

అయితే అప్పటికే ఆటోలో డ్రైవర్ తో పాటుగా మరో ఇద్దరు ఉన్నారు అయినా ఏమి చేయలేని పరిస్థితులో ఆమె ఆటోలో ప్రయాణం చేసింది ..అయితే తానూ దిగవలసిన ప్రాంతం దాటిపోతున్నా సరే ఆటో ఆపకపోవడంతో ఆపమని అరుస్తున్న ఆమెని వారి చేతులతో నోటిని మూసేశారు..సమీపంలోని సారిపల్లి లోని ఓ నిమానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడారు..ఈలోగా అటుగా ఓ వ్యక్తీ సైకిల్ పై వెళుతూ ఆమె అరుపులు విని అక్కడికి చేరుకోగా ఈలోగా వారు అక్కడి నుంచీ పారిపోయారు..

అనంతరం సైకిల్ పై వచ్చిన ఆ వ్యక్తి సాయంతో ఆమె పూసపాటి రేగలోని తన ఇంటికి వెళ్లిపోయింది..జరిగిన సంఘటనను కుటుంబ సభ్యులకు వివరించింది…దాంతో వెంటనే హుటాహుటిన విజయనగరం జిల్లా కేంద్రం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు. అయితే బాధిత మహిళ దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..ఇప్పటికే ఎన్నో హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా జరిగి ఎంతో సంచలనం కలిగిస్తుంటే తాజాగా ఏపీ లో జరిగిన ఈ ఘటన ఆందోళనకి గురిచేస్తోంది..