పెళ్లి పేరుతో వాడుకుంటే ఇక కఠిన చర్యలు తప్పవు  

పెళ్లి పేరు చెప్పి ఆ రకంగా వాడుకుంటే రేప్ చేసినట్లే అని తీర్పు చెప్పిన సుప్రీం కోర్ట్. .

Physical Relation On False Promise Of Marriage Is Rape-

అమ్మాయిలని పెళ్లి పేరు చెప్పి వాడుకునే యువతరం ప్రస్తుతం భాగా ఎక్కువైపోయింది.ముందు ప్రేమ అని చెప్పి, తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి శారీరకంగా లోబరుచుకోవడం, తరువాత అమ్మాయిలని వదిలించుకోవడానికి ఏవో కొత్త ఎత్తులు వేయడం చేస్తూ ఉంటారు.కొంత మంది ప్రేమించిన అమ్మాయిలని మోసం చేసి వేరొకరితో పెళ్ళికి రెడీ అయిపోతారు.

Physical Relation On False Promise Of Marriage Is Rape--Physical Relation On False Promise Of Marriage Is Rape-

అయితే ఇప్పుడు ఇలా చేద్దామని ఆలోచనలకి యువతరం కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే.ఎందుకంటే పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా వాడుకుంటే రేప్ క్రింద పరిగణించాల్సి వస్తుందని సుప్రీం కోర్ట్ ఓ కేసులో కీలక తీర్పు చెప్పింది.

చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ డాక్టర్‌ 2013లో్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించిన కేసులో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన సుప్రీం బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.పెళ్లి పేరుతో నమ్మించి తనని శారీరకంగా వాడుకొని తర్వాత వేరొక అమ్మాయితో అతను పెళ్ళికి రెడీ అవడంపై చత్తీస్ గడ్ హై కోర్ట్ గతంలో ఆ డాక్టర్ కి పదేళ్ళ జైలు శిక్ష విధించింది.అయితే దానిపై అతను సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించాడు.ఈ కేసులో తుది తీర్పు చెప్పిన సుప్రీం కోర్ట్ అతనిని దోషిగానే తేల్చి శిక్షని ఖారారు చేసింది.