సుకుమార్ డిఫరెంట్ డైరెక్టర్.వర్క్ అయినా, స్టోరీ అయినా, మేకింగ్ స్టైల్ అయినా చాలా ఢిపరెంట్ గా ఉంటాయి.
ఆయన సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్ ను చాలా యూనిక్ గా తీర్చి దిద్దుతారు.అంతే అద్భుతంగా తెరపై ప్రెసెంట్ చేస్తారు.
ఇక ఆయన సినిమాల్లో హీరోల విషయాని వస్తే.సుకుమార్ సినిమాకు ముందు.
ఆ తర్వాత అనే రీతిలో వారి లుక్ ఉంటుంది.అంత అద్భుంగా లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు.
ఇంతకీ ఆయన సినిమాల్లో నటించిన హీరోల లుక్ గతంలో ఎలా ఉండేది.? ఆయన సినిమాలు చేశాక ఎలా ఉంది? అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
అల్లు అర్జున్
గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ని చూపించి ఆర్యాలో బన్నిని చూపిస్తే ఇద్దరు ఒక్కరేనా అనే అనుమానం కలుగుతుంది.ఫిజికల్ గా లుక్ మాత్రమే కాదు.తన వన్ సైడ్ లవ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా తీర్చి దిద్దాడు.
రామ్
దేవదాసు సినిమాలో రామ్, జగడంలో రామ్ మధ్య చాలా తేడా కనిపిస్తుంది.లుక్ తో పాటు క్యారెక్టర్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది.
నాగ చైతన్య
ఏమాయ చేసావె సినిమాలో క్లాస్ లవర్ బాయ్ లుక్ లో ఉన్న చైతన్యని 100% లవ్ సినిమాలో కొంచం లాంగ్ హెయిర్ తో ఇంటెలిజెంట్ కన్నింగ్ రోల్ లో చూపించాడు సుకుమార్.
మహేష్ బాబు
SVSCలో చిన్నోడిగా కనిపించి మహేష్ బాబు,, నేనొక్కడినే సినిమాలో సిక్స్ ప్యాక్ లో స్టైలిష్ గా చూపించాడు.
ఎన్టీఆర్
టెంపర్ మాస్ గా కనిపించిన ఎన్టీఆర్ ను నాన్నకు ప్రేమతో సినిమాలో ఓరేంజి క్లాస్ లుక్ లో చూపించాడు.
రాంచరణ్
ధృవ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ ను రంగస్థలం సినిమాలో చిట్టి బాబు అనే మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించేలా చేశాడు.
అల్లు అర్జున్
అలా వైకుంఠపురంలో క్లాస్ లుక్ లో కనిపించిన బన్నిని పుష్ష సినిమాలో కలప దొంగగా మాస్ క్యారెక్టర్ లో చూపించాడు.