ఈ జైలును చూస్తే మీరు చచ్చినా బయటకు రానంటారు!

సాధారణంగా జైలు అంటే చీకటి గదులు, దుమ్ము ధూళి పట్టి ఉండటం, అక్కడి భోజన సదుపాయాలు అన్ని కూడా ఒక్కసారి తలుచుకుంటే ఎంతో భయంకరంగా ఉంటుంది.అలాంటి భయంకరమైన వాతావరణంలోకి ఎవరూ కూడా వెళ్లాలని అనుకోరు.

 San Francisco Nordic Prison Photos Viral In Social Media, San Francisco, Twitter-TeluguStop.com

అలాంటి వాతావరణంలో నేరం చేసిన వాళ్లని ఉంచితే వారు చేసిన తప్పులకు పశ్చాత్తాపడతారన్న ఉద్దేశంతో అలాంటి వాతావరణాన్ని కల్పిస్తుంటారు.కానీ శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న జైలను చూస్తే ఎవరైనా సరే ఏదో ఒక నేరం చేసి అక్కడికి వెళ్లాలని అనుకుంటారు.

అక్కడ జైలు అచ్చం ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించేలా ఉంటాయి.

శాన్ఫ్రాన్సిస్కో దేశంలో ఉన్న జైల్ల ఫోటోలను డ్యార్రెల్ ఓవెన్స్ (@IdoTheThiking) అనే అతను తన ట్విట్టర్ ద్వారా జైల్ల ఫోటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.ఈ ట్వీట్ లోని మొదటి రెండు ఫోటోలలో ఖైదీలు నివసించడానికి ఏర్పాటుచేసిన గదులు.

కింద ఉన్న రెండు ఫోటోలు దాదాపు 12 మంది ఖైదీలు కలిసి నివసించడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారని ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు.

ఈ ఫోటోలను చూసిన నెటిజనులు వేల సంఖ్యలో లైక్స్, రీ ట్వీట్ చేయడం ఎంతో విశేషం.నేరస్తులు నివసించడానికి ఏర్పాట్లు చేసిన గదులను బయట ఎక్కడైనా కొనుగోలు చేయాలంటే ఒక్కో గది ఖరీదు దాదాపు మూడు వేల డాలర్లు అవుతుందంట.మన భారత కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.2,20741 అవుతుందని తెలిపారు.ఈ ఫోటోలను చూసిన మరికొంత మంది నెటిజన్లు జైలు అంటే చీకటి గదిలా ఉండాలి కానీ,ఇంత లక్సరీగా ఉంటే నేరస్తులలో మార్పు ఎలా వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఖైదీలలో మార్పు తెచ్చేందుకే ఇలాంటి సౌకర్యాలు ఉన్న గదులలో ఉంచుతారు.అయితే ఇందులో ఎలాంటి లాజిక్ దాగివుందో వారే తెలియజేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube