మాస్క్ తీయమన్న ఫోటోగ్రాఫర్స్.. ఫేస్ చూస్తే భయపడతారు..రష్మిక కామెంట్స్ వైరల్!

నేషనల్ క్రష్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండగా కాస్త తన సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి నాలుగు రోజులు పాటు మాల్దీవుల వెకేషన్ కి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈమె మాల్దీవులలో ఎంతో ఎంజాయ్ చేసిన అనంతరం తిరిగి ముంబై చేరుకున్నారు.ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన రష్మికను ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా చుట్టుముట్టి తన ఫోటోలను కెమెరాలలో బంధించారు.

అయితే ఫోటోగ్రాఫర్లు మేడం ఒకసారి మాస్క్ తీయండి ప్లీజ్ అంటూ రష్మికను వేడుకున్నారు.దీనికి రష్మిక ఇప్పుడు మాస్క్ తీస్తే మీరు నా ఫేస్ చేసి భయపడతారు అసలు తీయను అంటూ సమాధానం చెప్పింది.

నాలుగు రోజులపాటు వెకేషన్ లో ఉన్న రష్మిక ఫేస్ మొత్తం నల్లగా మారిపోయిందని అందుకే తాను మాస్క్ తీయదలుచుకోలేదంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోయారు.

Advertisement

కనీసం కారులోకి వెళ్లేముందు అయినా మాస్క్ తీయండి అంటూ ఫోటోగ్రాఫర్లు వేడుకోగా అందుకు రష్మిక ఏ మాత్రం ఒప్పుకోలేదు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రష్మిక ప్రస్తుతం వారసుడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

ఇవే కాకుండా బాలీవుడ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్లో కూడా బిజీ కానున్నారు.తాజాగా హిందీలో నటించిన గుడ్ బై సినిమా విడుదల కాగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు