వైరల్ వీడియో: విమానం అంచున‌ కూర్చొని ఫొటోషూట్ చేసిన ఫొటోగ్రాఫ‌ర్...!

తాజాగా సౌదీ అరేబియా దేశంలో 90 వ నేషనల్ డే ఆఫ్ సౌదీ అరేబియా వేడుకలను పురస్కరించుకున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షోను ఇందుకు సంబంధించి రిహార్సల్స్ చేశాయి.అయితే ఈ క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ తన ప్రతిభను ప్రపంచానికి అర్థమయ్యేలా చూపించాడు.

 Photographer Direct Fighter Planes During A Mid-air Shoot, Photographer, Mid-air-TeluguStop.com

తనకు తన వృత్తి పట్ల ఉన్న గౌరవం, నిబద్ధత, డెడికేషన్ ఎలా ఉంటాయో అని ప్రపంచానికి తెలియజేశాడు.ఇంతలా ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు అనే కదా మీ డౌట్.

అసలు ఆ ఫోటో గ్రాఫర్ ఏం చేశాడు అనే విషయానికి వస్తే…

సదరు ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఆర్మీ విమానం వెళుతున్న సమయంలో విమానం వెనకవైపు తెరిచి ఉన్న ర్యాంపు డోర్ వద్దకు చేరుకొని వెనుక వస్తున్న జెట్ విమానాలకు సంబంధించిన ఫోటోలను ఫోటోగ్రాఫర్ షూట్ చేశాడు.అయితే ఈ విషయం పెద్ద విషయమా…? అని అనుకుంటారేమో.మామూలుగా మనం ఫోటోలు దిగేటప్పుడు ఎలా అయితే ఫోటోగ్రాఫర్ డైరెక్షన్స్ ఇస్తే మనం నిలబడి ఫోటోలు దిగుతామో… అలాగే ఈ ఫోటో గ్రాఫర్ కూడా ఆ విమానాలకు ఎలా నిలబడాలో తెలుపుతూ వాటిని డైరెక్షన్ చేశాడు.

ఆ విమానాలకు కాస్త పైకి వెళ్ళు, కాస్త కిందికి వెళ్ళు సైడ్ కు జరుగు అంటూ అనేక సంకేతాలు ఇస్తూ వెనక వస్తున్న లోకో పైలెట్స్ కు కూడా సమాచారం అర్థమయ్యేలా అతను తెలియజేశాడు.

దీంతో జెట్ విమానాలను నడుపుతున్న లోకో పైలెట్ కూడా ఫోటోగ్రాఫర్ ఇస్తున్న సంకేతాలకు అనుగుణంగా వారు జెట్ విమానాలను ఓ క్రమ పద్ధతిలో నడిపారు.చివరికి ఆ ఫోటో గ్రాఫర్ ఫలితం దక్కింది.

అతడు అనుకున్న విధంగా జెట్ విమానాలు కు సంబంధించి ఫోటోషూట్ ని పూర్తి చేశాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube