సూపర్ స్టార్ మహేష్‌బాబు టాలీవుడ్ టాప్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంటుంది.
ఇక ఆయన కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్ మీడియాలో ఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు.
సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తూ ఈ చిన్నారి చిన్నప్పటి నుండే సెలబ్రెటీ స్థాయిని పొందింది.సితూపాప అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు ఫ్యాన్స్.
ఏ పండుగ అయినా కూడా సితూపాప సందడి మాత్రం కన్ఫర్మ్.అలాగే ఈసారి కూడా సితూపాప తన కొత్త ఫొటోతో నెటిజన్స్ ముందుకు వచ్చింది.క్రిస్మిస్ ట్రీ వద్ద సితూపాప నిల్చుని ఉన్న ఫొటోతో క్రిస్టియన్స్‌కు శుభాకాంక్షలు చెప్పింది.హిందూ ముస్లీం క్రిస్టియన్ ఇలా అన్ని పండుగలకు కూడా సితార నెటిజన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది.
సితార ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్ చేస్తున్న విషయం తెల్సిందే.మొత్తానికి సితార అప్పుడే తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది.