ఫొటోటాక్‌ : కనిపించిన ప్రతిసారి టెన్షన్‌ పెడుతూనే ఉన్నాడు  

Photo Talk Mokshagna-mokshagna

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరోగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు.ఆయన ఏ సినిమా చేసినా కూడా సక్సెస్‌ అవ్వడం లేదు.

Photo Talk Mokshagna-Mokshagna

ఇటీవల వచ్చిన రూలర్‌ చిత్రం దారుణమైన పరాజయంను చవిచూసిన విషయం తెల్సిందే.బాలకృష్ణ ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పి ఆయన కొడుకును సినిమాల్లోకి తీసుకు రావాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు.

అయితే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాత్రం హీరో అవ్వడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మోక్షజ్ఞ ఫిజిక్‌ను చూస్తుంటే ఆయనకు సినిమాల్లో నటించడం ఏమాత్రం ఆసక్తిగా ఉన్నట్లుగా లేడు.ఎందుకంటే ఆయన లావు అస్సలు తగ్గడం లేదు.గత రెండు సంవత్సరాలుగా మోక్షజ్ఞను చూస్తున్న వారు ఎవరైనా కూడా అతడు బరువు తగ్గడం లేదు ఏంది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మోక్షజ్ఞ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటున్నారు.కాని మోక్షజ్ఞ మాత్రం బరువు తగ్గినట్లుగా కనిపించడం లేదు.

మోక్షజ్ఞ మరోసారి ఎయిర్‌ పోర్ట్‌లో తండ్రి బాలయ్యతో కనిపించాడు.ఈసారి కూడా మళ్లీ మోక్షజ్ఞ బరువు చూసి అంతా అవాక్కవుతున్నారు.

మోక్షజ్ఞ మొహంలో హీరో అవ్వాల్సిన చార్మింగ్‌ లేకపోవడంతో పాటు లావు ఎక్కువగా ఉండటంతో మోక్షజ్ఞ హీరో అవుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.లావుగా ఉంటే హీరో అవ్వడం అనుమానమే.ఆయన ఏం చేసినా కూడా బరువు తగ్గే అవకాశం లేదా అంటూ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఇలా లావు ఉండి టెన్షన్‌ పెడుతున్నాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు