తెలుగులో అందాల రాక్షసి సినిమాతో మిధున పాత్రలో “నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న” అంటూ క్యూట్ క్యూట్ మాటలతో తెలుగు ప్రేక్షకులని కట్టి పడేసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులకి అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పటికీ సరైన హిట్ లేక పోవడంతో లావణ్య త్రిపాఠిని తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా గుర్తించలేదు.
అయినప్పటికీ తన నటనా చాతుర్యంతో దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.
అయితే తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి పాల్గొంది.
ఇందులో భాగంగా నల్లటి దుస్తుల్లో హాట్ హాట్ పోజులు ఇచ్చింది.అయితే ఈ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి తన అభిమానులతో పంచుకుంది.
అయితే ఈ అమ్మడి అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతేగాక తన అందంతో కుర్రకారు గుండెలను పిండేసినటువంటి అందాల రాక్షసి అంటూ తన అందాన్ని అభివర్ణిస్తున్నారు.
అంతేగాక ఈ ఫోటోలని షేర్ చేసిన కొద్ది సేపటిలోనే లక్షల వ్యూస్ వచ్చాయి.దీంతో అర్థం చేసుకోవచ్చు లావణ్య త్రిపాఠికి ఎంత క్రేజ్ ఉందొ అని.
అయితే తాజాగా ఈ అమ్మడు నటించినటువంటి అర్జున్ సురవరం చిత్రం మంచి హిట్ అయ్యింది.అలాగే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి నూతన దర్శకుడు జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఏవన్ ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో నటిస్తోంది.