వైరల్ అవుతున్న అమెరికన్ వైద్యుడి ఫోటో...హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!  

కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతున్న ప్రపంచాన్ని ఒడ్డుకు చేర్చి, ఎంతో మందిని రక్షించింది కేవలం వైద్యులు మాత్రమే.కరోనా సమయంలో వైద్యులు చేసిన అనితర సేవలు, నిరాటంకంగా వాళ్ళు వెచ్చించిన సమయం ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపింది.

TeluguStop.com - Photo Of An American Doctor Going Viral

ప్రపంచం మొత్తం వైద్యుల సేవలకు తలలు వంచి మరీ కృతజ్ఞతలు తెలిపింది.కరోన మహమ్మారి నుంచి కోలుకున్న వైద్యులు అయితే తమకు పునర్జన్మను ఇచ్చిన వైద్యుల ఫోటోలకు పూజలు కూడా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది.ఇదిలాఉంటే

కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి నిరాటంకంగా వైద్య సేవలు అందిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నా అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న యునైటడ్ మెమోరియల్ హాస్పటల్ లో పనిచేస్తున్న డాక్టర్ జోసఫ్ వారన్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి.ఎందుకంటే దాదాపు 251 రోజులుగా కనీసం ఇంటికి కూడా వెళ్ళకుండా జోసెఫ్ అక్కడి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

TeluguStop.com - వైరల్ అవుతున్న అమెరికన్ వైద్యుడి ఫోటో…హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image

చివరికి అమెరికా ప్రజలకు ఎంతో స్పెషల్ డే అయిన థాంక్స్ గివింగ్ డే రోజున కూడా ఆయన రోగులతోనే ఉన్నారు.ఆ రోజున రోగులు ఎంతో భావోద్వేగానికి లోనవుతున్న సమయంలో ఓ రోగిని జోసఫ్ హత్తుకుని ఒదార్చుతున్న ఓ ఫోటో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

251 రోజులుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా రోగుల పట్ల జోసెఫ్ చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిదని అంటున్నారు నెటిజన్లు.వారికి సేవలు చేయడమే కాదు మానసికంగా జోసెఫ్ ధైర్యం చెప్పడంపై ప్రశంసలు వర్షం కురుస్తోంది.అయితే జోసెఫ్ మాత్రం అమెరికా ప్రజలు రోడ్లపై తిరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

థాంక్స్ గివింగ్ డే రోజున ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరిగారని, ఈ ప్రభావం త్వరలో కనపడుతుందని అన్నారు.క్రిస్మస్ సెలవు దినాలలో మాత్రం ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరుకుంటున్నారు.

జోసెఫ్ చేస్తున్న సేవలకు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు.హ్యట్సాఫ్ జోసఫ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

#Texas #PujasFor #UnitedMemorial #PhotoOf #Corona Epidemic

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు