ఏపీకి వణికిస్తున్న ఫోని! మరో రెండు రోజులు టెన్షన్

ఉత్తరాంద్ర జిల్లాలని ఇప్పటికే హుద్ హుద్ తుఫాన్, తిత్లి తుఫాన్ నాశనం చేసాయి.వాటి ప్రతాపం వలన మూడు జిల్లాలో విపరీతమైన, ఆర్ధిక నష్టం సంభవించింది.

 Phoni Cyclone Effect On Uttarandhara Districts-TeluguStop.com

కుటుంబాలు రోడ్డున పడే పరిస్తితి వచ్చింది.ఇప్పుడు మరో సారి మరో తుఫాన్ ఉత్తరాంద్ర మీద విరుచుకుపడబోతుంది.

అదే ఫోని తుఫాన్.గత వారంలో రోజులుగా వాతావరణ శాఖ ఫోని తుఫాన్ గురించి హెచ్చరిస్తూ ఉంది.

దీంతో ఉత్తరాంద్ర ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది.ఏక్షణం ఈ ఫోని తుఫాన్ ఎలా విరుచుకుపడుతుందో అర్ధం కాక అందరూ టెన్షన్ పడుతున్నారు.

ఫోని పెను తుపానుగా మారి ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంలో పయనిస్తూ, ఈనెల 3న ఒడిశాలో తీరం దాటుతుంది అని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.ఈ నేపధ్యంలో తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది.

దీంతో ఈ రెండు జిల్లాలతో పాటు విశాఖలోను అధికారుల యంత్రాంగం అప్రమత్తమైంది.పెను తుపాన్‌ దాటికి తీర ప్రాంతంలో గంటకు 90 నుంచి 118 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, ఇక గతంలో వచ్చిన రెండు తుఫాన్ ల కంటే ఈ తుఫాన్ ప్రమాదకర స్థాయిలో ఉందని వాతావరణ శాఖ చెబుతున్న మాటల బట్టి ఉత్తరాంద్ర ప్రజలు అలా భయం గుప్పిట్లో బ్రథుకుతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube